ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కేంద్రానికి స‌డెన్‌గా ప్రేమ పొంగింది. 2014-15లో ఇవ్వాల్సిన లోటు నిధులు 8 ఏళ్ల త‌రువాత అడ‌గ‌కుండానే విడుదల చేయ‌డం వెనుక ఏదో చిదంబ‌ర ర‌హ‌స్యం ఉంద‌ని అంతా అనుమానించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఖ‌ర్చు వైసీపీ భ‌రించినందుకే ఈ ప‌దివేల కోట్లు ఇచ్చార‌ని కొంద‌రు అంటుంటే, ముంద‌స్తుకి వెళ్లే జ‌గ‌న్ రెడ్డికి స‌హాయంగా ఉంటుంద‌ని, త‌మ‌కీ తెలంగాణలో ఎన్నిక‌ల ఖ‌ర్చు స‌ర్దుబాటు చేస్తాడ‌నే ఒప్పందం వ‌ల్లే ఈ ప‌దివేల కోట్లు 8 ఏళ్ల త‌రువాత విడుద‌ల‌య్యాయ‌నే విశ్లేష‌ణ‌లున్నాయి.
అనుమానాల‌న్నీ పటాపంచ‌లు చేస్తూ టిడిపి నేత‌లు, ఆర్థిక‌వేత్త‌లు ప‌దివేల‌కోట్లు వెనుక రాష్ట్రానికి పెడుతున్న తూట్లు ఏ స్థాయిలో ఉన్నాయో గుట్టుర‌ట్టు చేశారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఏ ఒప్పందంపై సంత‌కం పెట్ట‌మంటే అక్క‌డే పెట్టేస్తూ ఎడాపెడా అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇంకా అప్పులు దొరికే అవ‌కాశం లేదు, గ‌రిష్టంగా కేంద్రం కూడా ఇవ్వాల్సినంత ఇచ్చి, పుచ్చుకోవాల్సిన‌వి పుచ్చుకుంద‌నే ప్ర‌చారం ఉంది. 2014-15లో కొత్త‌గా ఏర్ప‌డిన ఏపీకి చ‌ట్ట‌ప్ర‌కారం ఇవ్వాల్సిన లోటు నిధులు రూ. పది వేల కోట్లు ఇవ్వ‌కుండా ..యుటిలిటీ స‌ర్టిఫికెట్లు, పీడీ అక్కౌంట్లు అని కాల‌యాప‌న చేసిన కేంద్రం ప్ర‌భుత్వం..ఇన్నేళ్ల త‌రువాత అవే నిధులు విడుద‌ల చేసింది. దీని వెనుక కార‌ణాల‌ను ఆర్థిక వేత్త‌లు లోతుగా విశ్లేషించగా, విస్తుపోయే వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయి. ఇక‌పై ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు నిధులు అడగబోమనే కండిషన్ల‌పై సంత‌కాలు చేసి ఇచ్చి కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తెచ్చుకుంది ఏపీ స‌ర్కారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన నిధుల‌నీ వ‌దులుకుని, ఇలా సంత‌కం పెట్ట‌డం ఏపీకి ఆర్థికంగా ఉరివేయ‌ట‌మేన‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించిన పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం చ‌ట్ట‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన నిధులు వ‌దులుకున్న‌ట్టే. ఏపీలో అమ‌ల‌య్యే కేంద్ర ప్రాయోజిత పథకాలకూ ఇక‌పై నిధులు ఇవ్వ‌రు, ఇవ్వాల‌నే అడిగే హ‌క్కునీ వ‌దులుకుంటున్నామ‌ని జ‌గ‌న్ రెడ్డి సంత‌కం చేసిన త‌రువాతే ప‌దివేల‌కోట్లు వ‌చ్చాయి. అంటే ఇది లోటు భ‌ర్తీ కాదు, రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద పోటు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read