వైసీపీతో ఏం ప్ర‌యోజ‌నాలున్నాయో తెలియ‌దు కానీ, ఒక హంత‌కుడి కోసం దేశ‌వ్యాప్తంగా సీబీఐ విశ్వ‌స‌నీయ‌తని కేంద్రంలోని బీజేపీ ప‌ణంగా పెట్టేస్తుంద‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వం పంజ‌రంలో చిలుక సీబీఐ అనే విప‌క్షం ఆరోప‌ణ‌లకి ఇప్పుడు ఒక మాజీ ఎంపీ, ఒక సీఎం బాబాయ్ ని హ‌త్య‌చేసిన నిందితుడిని అరెస్టు చేయ‌డంలో కేంద్రం ఒత్తిడి గురైన సీబీఐని చూసి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. ఏపీలో బీజేపీకి వైకాపాకి పొత్తులేదు. కానీ వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి కోసం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ని కూడా మేనేజ్ చేస్తున్నారంటే..ఈ నిందితులని కాపాడ‌టానికి పూర్తిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని బీజేపీ కేంద్ర పెద్ద‌లేన‌ని సామాన్యుల‌కి సైతం అవ‌గ‌త‌మైపోయింది. వైఎస్ జ‌గ‌న్ రెడ్డిని ప్ర‌ధాని మోదీ బిడ్డ‌లా కాపాడుతున్నార‌ని కేంద్ర‌మంత్రి ఒక‌రు చెప్పిన అంశం ఇప్పుడు మ‌న‌నం చేసుకుంటే, కొడుకు ఎన్ని త‌ప్పులు చేసినా వెన‌కేసుకొచ్చే తండ్రిలా ఉంది కేంద్ర పెద్ద‌ల పాత్ర అనేది సుస్ప‌ష్టం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read