డిప్యూటీ సియం, రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ రోజు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావటంతో, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాసం ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాత, పిలి సుభాష్ చంద్రబోస్, మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు పార్లమెంట్ లో అడుగు పెట్టటం, చిరకాల కోరిక అని, అది ఇప్పుడు తీరిందని అన్నారు. ఈ ఏడాది కాలంలో తన పని తనకు సంతృప్తిని కలిగించిందని అన్నారు. రాజ్యసభలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, సంతోషంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో, అందరితో కలిసి పోరాడతామని అన్నారు. ప్రజల కోసం, కష్టపడి పని చేస్తాం అని అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, సరిగ్గా ఇక్కడే బోస్ చేసిన వ్యాఖ్యలు, చర్చనీయంసం అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎజెండానే, ప్రత్యేక హోదా అనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎన్నికలు అయి, తానూ సియం అవ్వగానే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, చేసేది ఏమి లేదు, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుతూనే ఉండాలి అని, జగన్ అన్నారు. దీంతో ఇక హోదా ఆశాలు పోయాయి. మొన్న రాజ్యసభ సీటు కూడా బీజేపీ అడిగిన వారికి ఇచ్చారు కానీ, ప్రత్యేక హోదా డిమాండ్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ని, విలేఖరులు, రాజ్యసభలో ప్రత్యేక హోదా పై, ఎలా పోరాటం చేస్తారు అని అడగగా, ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకం తనకు లేదు అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సియం హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతే కాదు, హోదా బదులు ఏదో ఇస్తాం అంటున్నారని, దాని గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే సుదీర్ఘ పోరాటం మేము చేసాం అని, కాని కేంద్ర ప్రభుత్వం, హోదా ఇవ్వం అంటూ, కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని, వాళ్ళేదో సెకండ్ ఆప్షన్ ఇస్తాం అంటున్నారు అంటూ బోస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read