ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో, నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల పై చర్చ జరుగుతుంది. సీఆర్డీఏ చట్టం రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రెండూ కలిపి చర్చించాలని శాసనమండలి మొత్తం నిర్ణయం తీసుకుంది. దీని పై నాలుగు గంటల పాటు చర్చ చెయ్యాలని, వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆదేశించారు. ఈ చర్చకు తెలుగుదేశం పార్టీకి 84 నిమిషాలు, అలాగే తెలుగుదేశం నామినేటెడ్‌ సభ్యులకు 8 నిమిషాలు, ఇండిపెండెంట్‌ గా ఉన్న సభ్యులకు 9 నిమిషాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 27 నిమిషాలు, పీడీఎఫ్‌కి 15 నిమిషాలు, బీజేపీ సభ్యలకు 6 నిమిషాల సమయం కేటాయించారు. దీంతో ఈ చర్చను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ తరుపున, ముందుగా ఎమ్మెల్సీ నారా లోకేష్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అమరావతిని చంపేసి, మూడు ముక్కల రాజధాని అంటూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ, లోకేష్ వ్యాఖ్యానించారు.

lokesh 22012020 2

జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఒక, తుగ్లక్‌ నిర్ణయం అని లోకేష్ అన్నారు. అసలు అమరావతిలో ఏమి జరుగుతుందో, వారి బాధలు ఏంటో, జగన్ మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి చూడాలని, కనీసం ఇప్పటి దాకా, అక్కడకు తన ఎమ్మెల్యేలని కూడా పంపలేదని అన్నారు. అంతే కాకుండా, వారిని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ, పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్నారని అన్నారు. అమరావతిలో ఇప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయని, వాటి వివరాలు చదివి వినిపించారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ భవనాలు, మళ్ళీ అక్కడ కట్టుకోవాలని, ఈ తుగ్లక్ నిర్ణయంతో, పెట్టిన ఖర్చు అంతా వృధా అవుతుందని లోకేష్ అన్నారు. ప్రపంచంలో 195 రాజధానులు ఉంటే, ఒక సౌత్ ఆఫ్రికాకు మాత్రమే, మూడు రాజధానులు ఉన్నాయని, మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఏమిటి అని అన్నారు.

lokesh 22012020 3

కేంద్రం కూడా తాజాగా, పరిపాలన మొత్తం ఒక్క చోటుకు తీసుకు రావాలని, ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, మనం ఇలా చెయ్యటం ఏమిటి అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే, అభివృద్ధి వికేంద్రీకరణ అని, మా 5 ఏళ్ళ హయంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని, దాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి కాని, ఈ పరిపాలన వికేంద్రీకరణ ఏమిటి అని ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంలో, ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లోకేష్ ఒక సర్క్యులర్‌ గురించి మాట్లాడుతూ, తన సెల్ ఫోన్ చూసి, ఆ సర్కులర్ చదివారు. లోకేశ్ మొబల్ తీసి చదువుతుండగా, బొత్సా కలగచేసుకుని, మొబైల్ ఉపయోగించకూడదు అంటూ చెప్పారు. అయితే మరో సీనియర్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ, మేము కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాం, సభలో వైఫై సౌకర్యం ఉంది, మేము మొబైల్ లో నోట్స్ రాసుకుంటున్నాం, డాకుమెంట్స్ చదువుతున్నాం అంటూ, ఆయన కూడా లోకేష్ కు మద్దతు పలకటంతో, బొత్సాకి కౌంటర్ ఇచ్చినట్టు అవ్వటంతో, ఇక అక్కడితో సెల్‌ఫోన్‌ పై చర్చ ముగిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read