రాజకీయాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదహరణ ఇది.. మాయావతి లాంటి దేశ స్థాయి నేతతో, పవన్ కళ్యాణ్ సమావేశం అవ్వటం, ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామం వెనుక ఉన్న "చాణిక్యుడు" ఎవరో, కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. పవన్ కు రాష్ట్రంలో సీన్ లేదు, ఒకటి అరా సీట్లు వస్తే గొప్ప. అలాంటి పవన్ తో మాయావతి ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది ? స్వయంగా ఆమె ఎందుకు ప్రకటన చేస్తుంది ? మాయావతి ఏపి రాజకీయల్లోకి వస్తే మొదటి దెబ్బ ఎవరికి ? ఇవన్నీ గమనిస్తే, దీనికి వెనుక ఉన్న "చాణిక్యుడు" ఎవరో తెలిసిపోతారు. ఈ రోజు ఉన్నట్టు ఉండి, మాయావతి, పవన్ కలిసారు.

jagan kcr 15032019

లక్నోలో శుక్రవారం మాయావతితో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లుగా తెలియవచ్చింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి ప్రధానిగా మాయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాయావతి మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో జనసేన, మిగిలిన వాపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్ల పంపకం పై ఎలాంటి విభేదాలు లేవన్నారు.

jagan kcr 15032019

ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. దేశంలో మిగిలిన పక్షాల కంటే తమ పక్షమే చాలా ముందున్నదని మాయావతి తెలిపారు. అయితే వీళ్ళిద్దరూ కలిస్తే, ముందుగా పెద్ద ఇబ్బంది వచ్చేది జగన్ కు. జగన్ కి ఉన్న ఎస్సీ ఓటింగ్ అంతా పవన్-మాయావతి కూటమి వైపు షిఫ్ట్ అవుతుంది, లేకపోతే చీలి పోతుంది. అప్పుడు జగన్ కి ఇత్తడి అయిపోతుంది, అందుకేనేమో, అందరికంటే ముందే, జగన కొత్త ఫ్రెండ్ అయిన తెరాస రియాక్ట్ అయ్యింది. బీఎస్పీ - జనసేన కూటమిపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కూటమిని పొలిటికల్ స్టంట్‌గా అభివర్ణించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వారు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారా.. ఏపీలో చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారా అనేదే ముఖ్యమన్నారు. ముందు దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, అసలు ఇక్కడ ఎవరు, ఎవరితో కలిస్తే, కవితకు వచ్చిన ఇబ్బంది ఏంటో మరి.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read