కడపలోని మామిళ్లపల్లి క్వారీలో జరిగిన పే-లు-ళ్ల-కు సంబంధించి జరిగిన అరెస్ట్ లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి గారైన భారతిగారి మేనమామ, కడపఎంపీ అవినాశ్ రెడ్డి పెదనాన్న ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీ.టెక్.రవి)చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వై.ఎస్.ప్రతాపరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కడప ఎస్పీ ధ్రువీకరించారని, ప్రతాపరెడ్డి అనే వ్యక్తి జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేసే డీలరని టీడీపీనేత తెలిపారు. వాటిని సరఫరా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒక్కోసారి సెల్ ఫోన్ రేడియేషన్ కే జిలెటిన్ స్టిక్స్ పేలిపోయే ప్రమాదముంటుందన్నారు. వాటిని క్వారీల్లో కూడా ప్రత్యేకంగా, ఎక్కడో దూరంగా ఉంచుతారన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదుగానీ, అవి పే-ల-డం-తో క్వారీలో 10 మంది చనిపోయారన్నారు. జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ, గతంలో ఎప్పుడో క్వారీ లీజు పొందిన నాగేశ్వరరెడ్డిని, ప్రతాపరెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. క్వారీ అసలు లీజుదారుగా అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన సీ.రామచంద్రయ్య సతీమణి కస్తూరిభాయి పేరు ఉందని, 2001నుంచి 2022వరకు లీజు పరిమితి ఆమె పేరుతోనే ఉందని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. నాగేశ్వరరెడ్డి లీజుకి తీసుకున్నాడో లేక, పే-లు-ళ్ల ఘటన తర్వాత అతనిపేరుతో లీజు ఉన్నట్లు ఇప్పుడు పత్రాలు సృష్టించారో కూడా ఆలోచించాలన్నారు. ఏప్రియల్ 01 -2016నుంచి 31-08- 2020 వరకు క్వారీకి రూ.46లక్షలవరకు లాయల్టీ ఫీజు చెల్లించాల్సి ఉందని గతంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరికీ ఎటువంటి ఫీజులు చెల్లించడంలేదని, ఇష్టానుసారం మైనింగ్ చేయడం, ఖనిజాన్ని అమ్ముకోవడం చేస్తున్నారని బీ.టెక్.రవి స్పష్టం చేశారు. జనవరి 16, 2019లో ఒకసారి, అక్టోబర్18-2019లో మరోసారి, ఆగస్ట్ 25-2020లో ఇంకోసారి మైనింగ్ అధికారులు, క్వారీని క్షుణ్ణంగా పరిశీలించి, సెప్టెంబర్ 26,2020లో లీజుని రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.

రూ.46లక్షల పాతబకాయిలు చెల్లించాల్సిఉందనికూడా చెప్పడం జరిగిందన్నారు. ఈ వ్యవహారమంతా ఒకటైతే, నాగేశ్వరరెడ్డి అనే అతనికి క్వారీని లీజుకి ఇచ్చేముందు ఇవేవీ తెలియకుండానే అతను లీజు తీసుకున్నాడా అని టీడీపీనేత సందేహం వెలిబుచ్చారు. నాగేశ్వర్ రెడ్డి అనే అతనిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి కేసులున్నాయని, గతంలో పీడీయాక్ట్ పై అతను జైలుకు కూడా వెళ్లొచ్చాడన్నారు. జీపీఏలో రామచంద్రయ్య సతీమణి పేరుతో ఒరిజినల్ లీజు ఉన్నట్టు ఉంటే, నాగేశ్వరరెడ్డి పేరుతో ఉన్నట్లు చెబుతూ, అతన్ని అరెస్ట్ చేయడమేంటన్నారు? క్వారీనుంచి ఇప్పటికే దాదాపు రూ.100కోట్ల మెటీరియల్ అమ్ముకున్నారని, దానికి ఇంకేం రాయల్టీ ఫీజు కడతారనే వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయన్నారు. లీజు రద్దు చేశాకకూడా రూ.100కోట్ల విలువైన మెటీరియల్ అమ్మకాలు ఎలా సాగాయన్నారు. రాయల్టీ ఫీజు కట్టకుండా, అక్రమంగానే క్వారీలో తవ్వకాలు సాగించారన్నారు. నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోకుండా, క్వారీ ఒరిజినల్ లీజుదారు ఎవరైతే ఉన్నారో, వారిని అరెస్ట్ చేయకుండా, ఎవరికో జీపీఏకి క్వారీ ఇచ్చామని వారిని అరెస్ట్ చేయడమేంటన్నారు? అసలు లీజుదారుని వదిలేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కిందిస్థాయి అధికారులకు ఏమైనా అదేశాలు అందాయా అని రవీంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. రామచంద్రయ్య సతీమణిని అరెస్ట్ చేయకపోవడం ముమ్మాటికీ అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు. అసలు లీజుదారు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీని వేరొకరికి లీజుకి ఇచ్చారని, అలాంటప్పుడు ప్రమాదానికి వారేకారకు లవుతారుగానీ, నాగేశ్వర్ రెడ్డికి ఏం సంబంధముంటుంద న్నారు. క్వారీలో పే-లు-ళ్ల-కు, పదిమంది చనిపోవడానికి కారకులైనవారిని అసలు లీజుదారులను వదిలేసి, నాగేశ్వర్ రెడ్డిని, ప్రతాపరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీఎమ్మెల్సీ చెప్పారు.

అసలు దోషులను ప్రభుత్వం వదిలేయడంపై తాము న్యాయస్థానాల్లో ప్రైవేట్ కేసులు దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రి గానీ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, సంబంధంలేని వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అసలు లీజుదారులపై ప్రభుత్వం కేసులుపెట్టి వారిని అరెస్ట్ చేసేవరకు ఈ వ్యవహారాన్ని వదిలేది లేదని బీ.టెక్.రవి తేల్చిచెప్పారు. రాయల్టీ ఫీజు కట్టకుండా రూ.100కోట్ల విలువైన మెటీరియల్ తరలించారని, అంత మెటిరీయల్ క్వారీ నుంచి పోయేదాకా చోద్యంచూసిన మైనింగ్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలో విషవాయువు లీకై చనిపోయినవారికి రూ.కోటి పరిహారం ఇప్పించిన ముఖ్యమంత్రి, ఇతర ప్రాంతాల్లో వివిధ కారణాలతో చనిపోతున్నవారికి మాత్రం రూ.5లక్షలు, రూ.10లక్షల పరిహారం ఇవ్వడమేంటన్నారు? ముఖ్యమంత్రే ఈ విధంగా తారతమ్యాలు, బేధాభిప్రాయాలు చూపడమేంటన్నారు? రుయాఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయినవారు ప్రజలుకారా అని బీ.టెక్.రవి ప్రశ్నించారు. రుయాలో ఆక్సిజన్ అందక చనిపోయింది వాస్తవమేనని, ఆసుపత్రిలోని అటెండర్లు తీసిన వీడియోలే అందుకు సాక్ష్యమన్నారు. ఎక్కడ, ఎవరు చనిపోయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి పరిహారం విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. రుయాఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు, కడపలో క్వారీ పే-లు-డు-లో చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తక్షణమే రూ.కోటిరూపాయల పరిహారం అందించాలని టీడీపీఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read