దేశంలో క-రో-నా విశృంఖలంగా ప్రబలుతోందని, దాంతో దేశమంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, దేశాధినేతలుగా ఉన్నవారు సకాలంలో స్పందించి, సరైన నిర్ణయాలు తీసుకోనందువల్లే, ఇటువంటి పరిస్థితి తలెత్తింద ని టీడీపీ సీనియర్ నేత, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన తన విలేకరుల సందేశాన్ని వీడియో రూపంలో అందచేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయంగా ఉన్న కంపెనీలు ముందుకురావడంతో ప్రధాని అంతా తానే చేసిన ట్టుగా చంకలు గుద్దుకున్నారన్నారు. ప్రపంచానికి తానే ఔష ధం కనిపెట్టినట్టు, అందించినట్లు ప్రగల్భాలు చెప్పుకోవడం జరిగిందని బుచ్చయ్య ఎద్దేవాచేశారు. రెండోదశ క-రో-నా వ్యాపిస్తుందని గమనించకుండా, యూరప్ దేశాలు సహా, అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో రెండో దశ కరోనా విస్తృతం గా ప్రబలుతుంటే పట్టించుకోకుండా, మతప్రచారాలు, ఎన్నికల ప్రచారాలకే మోదీ ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. దానివల్లే నేడు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. తొలిదశ క-రో-నా సమయంలో ప్రజలంతా, ప్రధాని చప్పట్లు కొట్టమంటే కొట్టారని, లాక్ డౌన్ అంటే పాటించారని, ఈరోజు న అదే వ్యక్తి రెండోదశ క-రో-నా వ్యాప్తిని ఎందుకు నిలువరించలేక పోయాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని ఇప్పటికే నవ్వులపాలు చేశాడన్నారు. ఒకపక్క కో-వి-డ్ ఉధృ తంగా ప్రబలు తుంటే ప్రధానికి పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం కోసం నాలుగు సార్లు పర్యటించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. గతంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి, దేశాన్ని తీవ్రంగా నష్టపరిచిన వ్యక్తి, నేడు వివిధరకాల మత పరమైన కార్యక్రమాలను కూడా ఎందుకు కట్టడిచేయలేక పోతున్నాడన్నారు. చివరకు దేశంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయో లేవోకూడా గమనించలేని దుస్థితికి పాలకులు చేరడం దురదృష్టకరమన్నారు. తాత్కాలిక వెంటిలేటర్లు, పడకలు కూడా ఏర్పాటు చేయకపోబట్టే, ఆసుపత్రుల ముందే రోజూ వందల ప్రాణాలు పోతున్నాయన్ని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగే ప్రాణనష్టానికి ప్రధానమంత్రే బాధ్యుడ వుతాడన్నారు. దేశం ప్రపంచానికి ఔషధ కర్మాగారమని చెప్పిన మోదీ, నేడు దేశంలో మందులు కూడా లభించడం లేదనే వాస్తవాన్ని గమనించాలన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు లేవని, దుకాణాల్లో మందులు కూడా దొరకడంలేదని, లక్షలాదిగా మరణాలు సంభవిస్తుంటే, వాటి సంఖ్యను తగ్గించి చూపుతున్నారని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తంచేశారు. గుట్టలు గుట్టలుగా శవాలతో దేశ మంతా నిండిపోతుంటే, ప్రజలకు సమాధానం చెప్పలేని మోదీని చూసి ఏమనాలో కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. ప్రధానిహోదాలో కుత్సిత, కుట్ర రాజకీయాలకు పాల్ప డకుండా, మోదీ దేశాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తే మంచిదని బుచ్చయ్యచౌదరి సూచించారు. ఏకపక్షంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం, అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటన వంటి నిర్ణయాలతో దేశాన్ని ప్రధాని అత లాకుతలం చేశాడన్నారు. సరైన సమయంలో ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగా మందులకోసం, ఆక్సిజన్ కోసం, పడకల కోసం ప్రజలంతా ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. వందల రోజులుగా దేశం కో-వి-డ్ వైరస్ తో అల్లాడుతుంటే, ప్రధాని ఆదిశగా దేశాన్ని ఎందుకు సన్నద్ధత పరచలేక పోయాడో ప్రజలకు సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు, మోదీ శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, పాశవిక ప్రభుత్వా నికి అధినేతలా వ్యవహరిస్తున్నాడన్నారు. తొలిదశ క-రో-నా సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం మొత్తుకున్నా మేల్కోకుండా పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ చిట్కాలతో ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించాడన్నారు. రాష్ట్రంలో భారీగాకేసులు పెరగడంతో చేతులుకాలాక ఆకులు పట్టుకు న్నట్లు నింపాదిగా తరువాత జగన్ ప్రభుత్వం కో-వి-డ్ కేంద్రాలను ప్రారంభించిందన్నారు.

నేడు రెండోదశ క-రో-నా వ్యాప్తిలో ప్రభుత్వం పూర్తిగా వైరస్ నిర్థారణ పరీక్షలను ఎందుకు నిలిపేసిందని బుచ్చయ్య నిలదీశారు. క-రో-నా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం ఏంచేసిందన్న ఆయన, ఎక్కడా వ్యాక్సిన్లు అందు బాటులో లేకుండా పోయాయన్నారు. తొలిదశ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి రెండోసారి వేయడానికి ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో పత్రికా ప్రకటనలకు, వేలకోట్లు ఖర్చుచేస్తున్న జగన్మో హన్ రెడ్డి, వ్యాక్సిన్ కొనడానికి డబ్బులేదనడం సిగ్గుచేటన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, పడక లు, మందులులేక రోగుల ప్రాణాలుపోతున్నా, ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తొలిదశ కరోనా నియంత్రణలోకి వచ్చిన వెంటనే కో-వి-డ్ కేంద్రాలను మూసేసిన జగన్ ప్రభుత్వం, ఎక్కడికక్కడ అంతా అయిపోయిందన్నట్లుగా నిర్లక్ష్యం గా వ్యవహరించిందన్నారు. రెండోదశ వైరస్ వ్యాప్తిని గమనించకుండా, ఆ దిశగా సన్నద్ధం కాకుండా ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు ఆర్డర్లు ఇస్తే, అవి ఎప్పటికి వస్తాయన్నారు. రోజూ శ్మశానాల్లో తగలేస్తున్న శవాల లెక్కలు తీస్తే, జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే పరిస్థితులు ఉండవని బుచ్చయ్య తేల్చిచెప్పారు. తన నీతిబాహ్యమైన విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన ముఖ్యమంత్రి, ఇంకెంతమందిని బలి తీసుకుంటాడో తెలియడం లేదని, టీడీపీశాసనసభ్యుడు వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read