ప్రస్తుతం రాష్ట్రంలో కక్ష సాధింపు ధోరణి నడుస్తుంది. కొత్తగా అధికారంలోకి రావటంతో, వైసీపీ నేతలు, రాజకీయ కక్ష సాధింపు మొదలు పెట్టారు. ఇదంతా ప్రభుత్వం మారినప్పుడు సహజమే అయినా, ఏకంగా నేతల భద్రత విషయంలో కూడా, ఈ కక్ష సాధింపు కొనసాగటం, కొద్దిగా ఇబ్బందికర పరిణామం. పెద్ద స్థాయి నేతలు, నక్సల్స్ త్రెట్ ఉన్న వారికి కూడా భద్రత తగ్గింపు, ఇప్పుడు సమస్యగా ఉంది. మాజీల వరకు భద్రత తగ్గింపు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పదవిలో ఉన్న వారికి కూడా భద్రత తగ్గింపు రాజకీయ కక్షకు పరాకాష్ట. సాక్షాత్తు జెడ్ + ఉన్న చంద్రబాబుకే చుక్కలు చూపిస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఒక్క మాట లేదు. చంద్రబాబు పరిస్థితే ఇలా ఉంటే, ఇక మామూలు నాయకుల పరిస్థితి మరీ దారుణం. విజయవాడ లాంటి చోట, రాజకీయ విమర్శలు అధికంగా చేసే నాయకులకు కూడా భద్రత తగ్గిస్తున్నారు.

తాజగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు, ఈ అనుభవం ఎదురైంది. తన సెక్యూరిటీని తగ్గించడంలో , దానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉన్న భద్రతా సిబ్బందిని కూడా వెనక్కు పంపించారు. ఇప్పటికే పలువురు మాజీలకు భద్రతను తగ్గించిన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల విషయంలోనూ సమీక్షలు చేసి, కొంత మందికి భద్రతను తగ్గిస్తుంది. ఈ క్రమంలో బుద్ధా వెంకన్నకు ఉన్న 2 ప్లస్ 2 సెక్యూరిటీని 1 ప్లస్ 1కు తగ్గించింది. దీని పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వెంకన్న, ఆ ఇద్దరూ కూడా వద్దని వారిని వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. అసలు అయితే విజయవాడలో నివాసం ఉంటున్న ప్రజా ప్రతినిధులు, మంత్రులకు సిటి సెక్యూరిటి వింగ్‌ నుంచి గన్‌ మెన్‌ లను భద్రతగా కేటాయిస్తారు. కృష్ణా జిల్లాలోని మిగతా ప్రజా ప్రతినిధులకు ఆర్మ్ డ్ రిజర్వ్‌ నుంచి గన్‌ మెన్‌ లను కేటాయిస్తారు. అయితే గన్‌ మెన్‌ ల ఉపసంహరణ తమ చేతుల్లో లేదని, స్థానిక విజయావాడ సిటీ పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ లో ఈ నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read