మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఈ రోజు ఉదయం పెట్టిన మీడియా సమావేశంలో, బుద్దా వెంకన్న, మంత్రి కొడాలి నానిని, అలాగే రాష్ట్ర డీజీపీ ని ఉద్దేశించి, కొన్ని వ్యాఖ్యలు చేసారని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశించి, ఆయన పైన కేసు నమోదు చేసి, బుద్దా వెంకన్నును పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తామని చెప్పి, పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు బుద్దా వెంకన్న ఇంటికి చేరుకున్నాయి. దాదపుగా 60 మంది పోలీసులు, ఒక ఏసిపీ, సిఐలు కూడా బుద్దా వెంకన్న ఇంటికి వచ్చారు. వీరు అంతా కూడా, బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం మీడియా సమావేశంలో, కొడాలి నని చంద్రబాబు ఇంటికి వద్దకు వస్తే మాత్రం, చంద్రబాబు గారి ఇంటి గేటు పట్టుకున్న తిరిగి వెళ్లలేడని, బుద్దా వెంకన్న పరుష వ్యాఖ్యలు చేసారు. అయితే కొడాలి నానిని శవం అయి పంపిస్తామని బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పైనే కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అలాగే డీజీపీ కూడా, జగన్ తొత్తుగా మారారని బుద్దా వ్యాఖ్యలు చేసారు. మంత్రిని బెదిరించటం, చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అని పోలీసులు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read