మార్చ్ 31 లోపు, బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే, ఏప్రిల్ 1 నుంచి, రూపాయి వాడటానికి కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉండదు. సహజంగా, ప్రతి సారి, ఫిబ్రవరి చివరి వారంలో కాని, మార్చ్ మొదటి వారంలో కాని బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే మన ప్రభుత్వం ఎన్నికల గోలలో పడి, ముందు ఎన్నికలు అయిపోవాలని, బడ్జెట్ ని మార్చ్ చివర్లో పెడదాం అని అనుకున్నారు. ఇలా చివరి దాకా వాయిదా వేస్తే, అనుకోని పరిస్థితి వస్తే ఎలా అనే ఆలోచన చెయ్యలేదు. దీంతో, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 27న ప్రారంభం కానున్నాయి అంటూ చెప్తూ వచ్చారు. తొలుత ఈనెల 28 నుంచి సమావేశాలు ప్రారంభించాలని భావించినా, 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కారణంగా ఎమ్మెల్యేలు ఆరోజు సభకు రావల్సి ఉంటుంది. దీంతో ఆ మరసటి రోజు నుంచే సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఇప్పడు రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మొత్తం లాక్ డౌన్ లో ఉంది. దీంతో, అసెంబ్లీ సమావేశాలకు వచ్చే పరిస్థతి లేదు. దీంతో ఇప్పుడు హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి, రెండు మూడు నెలలకు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో తర్జబర్జన పడుతూనే ఉంది. అన్ని విషయాలు అలోచించి, ఇక అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాసం లేదని, కేవలం ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తేవటం ఒక్కటే మార్గం అని ప్రభుత్వ పెద్దలు ఆలోచనకు వచ్చారు. మరో, రెండు మూడు రోజుల్లో దీని పై నిర్ణయం ప్రకటించనున్నారు.

సహజంగా, బడ్జెట్ సమావేశాలు, 15 రోజులు జరుగుతాయి. అది కూడా ఫిబ్రవరి చివరి వారంలో, లేదా మార్చ్ మొదటి వారంలో, తొలిరోజున గవర్నర్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ జరుగుతుంది తరువాత, బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని పై చర్చ ఉంటుంది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి సమావేశాలు ముగిస్తారు. అయితే, మన ప్రభుత్వం, ఇది ఆలోచన చేసిందా, లేక ఎన్నికలు ముందు అయిపోవాలి, బడ్జెట్ ఏముంది అనుకున్నారో ఏమో కాని, ఇప్పుడు చివరకు ఆర్దిన్దన్స్ ద్వారా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టే పరిస్థితికి తెచ్చారు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి, ఇక చేసేది ఏమి లేదు. నెల రోజుల క్రిందట తెలంగాణా, ఇతర రాష్ట్రాలు బడ్జెట్ పెట్టుకుని, సేఫ్ గా ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read