చట్ట సభల్లో, ఛాలెంజ్ లు విసురుకోవటం చూస్తూ ఉంటాం. ఇది నిరూపించు, అది నిరూపించు, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు ఏమి చేస్తావ్. క్షమాపణ చెప్పు, రాజీనామా చెయ్యి, ఇలా అనేక ఛాలెంజ్ లు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు, మనకు తెలిసిన దాంట్లో, ఇలా రాజకీయ ఛాలెంజ్ చేసి, నిలబడిన వ్యక్తీ ఒకే ఒక్కరు. ఆయనే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు, అలాగే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఛాలెంజ్ లు చూస్తూనే ఉన్నాం. మొన్న అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గారు, సున్నా వడ్డీ రుణాల పై ఛాలెంజ్ ఛాలెంజ్ అన్నారు, వెంటనే తెలుగుదేశం పార్టీ డేటాతో రావటంతో, సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శాసనమండలిలో కూడా ఇలాంటి ఛాలెంజ్ ఒకటి విసిరారు, అధికార పార్టీ నేతలు.

buggana 22012020 1

శాసన మండలిలో, రాజధాని పై చర్చ సందర్భంగా, లోకేష్ మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాజధాని తరలింపు ఒక తుగ్లక్ చర్య అంటూ లోకేష్ తప్పు పట్టారు. ఇప్పటికే అమరావతిలో అనేక భవనాలు కట్టుకున్నామని అన్నారు. సచివాలయం, హైకోర్ట్, రాజ్ భవన్, అసెంబ్లీ, శాసనమండలి, సీఆర్డీఏ ఆఫీస్, డీజీపీ ఆఫీస్, టెక్ టవర్స్, విద్యుత్ సౌదా, ఆర్ అండ్ బీ బిల్డింగ్, దేవాదాయ భవనం, ఇలా అనేక భవనాలు, అనేక కోట్లు పెట్టి ఖర్చు చేసామని, ఇప్పుడు ఈ భవనాలు అన్నీ ఇక్కడ వదిలేసి, మళ్ళీ వైజాగ్ వెళ్లి కొత్త భవనాలు కడతారా అని, చెప్తూ, ఇప్పటికే, నవరత్నాలు అమలు కోసం చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, లోకేష్ అన్నారు.

buggana 22012020 1

అయితే లోకేష్ చేసిన వ్యాఖ్యల పై మంత్రి బుగ్గన అభ్యంతరం చెప్పారు. అసలు మేము అలాంటి ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదని, ఆ జీవో నెంబర్ ఏమిటో చెప్పాలని, లోకేష్ కి ఛాలెంజ్ చేస్తున్నా అని, జీవో నెంబర్ అయినా చెప్పండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అంటూ ఛాలెంజ్ చేసారు. దీని పై, లోకేష్ వెంటనే స్పందించారు. జీవో కాదని, ప్రభుత్వం నుంచి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, ఒక సర్కులర్ అన్ని జిల్లాలకు ఇచ్చారని, ఇందులో, నవరత్నాల కోసం, చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు, హైకోర్ట్ అభ్యంతరం చెప్పని భూములు చెప్పాలని ఉందని, లోకేష్ చదివి విపించి బుగ్గన ఛాలెంజ్ కు సమాధానం చెప్పారు. అయితే, బుగ్గన మాత్రం, జీవో చెప్పాలని అడిగితే, ఇప్పుడు సర్కులర్ అంటున్నారని, అయినా, హైకోర్ట్ అభ్యంతరం చెప్పని భూములు అని ఉంటే, ఇంకా ఏమిటి అంటూ స్పందించారు. అయితే అటు వైపు నుంచి టిడిపి, ఏదైనా, చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి కదా అని చెప్పారు. మొత్తానికి బుగ్గన ఛాలెంజ్ కు లోకేష్ వెంటనే సమాధానం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read