ఆంధ్రప్రదేశ్ లో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తన వైపు తిప్పుకోవటానికి, ఇచ్చిన అతి ముఖ్యమైన హామీ సిపీఎస్ రద్దు. ఉద్యోగులకు సిపీఎస్ రద్దు చేస్తానని, ప్రతి పాదయాత్రలో హామీ ఇచ్చారు. అయితే దీనికి టైం కూడా పెట్టారు. కేవలం వారం రోజుల్లోనే రద్దు చేసి పడేస్తా అని, ప్రతి ఊరి సెంటర్ లో, గట్టిగా అరుస్తూ చెప్పారు. ఉద్యోగులకు ఈ హామీ ఎంతో ముఖ్యమైనది కావటంతో, అందరూ జగన్ వైపు గంపగుత్తగా వేసేసారు. జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయి. భారీ మెజారిటీతో గెలిచారు. ఇంకేముంది వారం రోజుల్లో సిపీఎస్ రద్దు అయిపోతుందని, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. వారం అయ్యింది, నెల అయ్యింది, ఏడాది అయ్యింది, ఇప్పటికి 18 నెలలు అయ్యింది. అంటే దాదాపుగా 70 వారల పైనే అయ్యింది. అయినా సిపీఎస్ రద్దు కాలేదు. అయితే ఇప్పుడు శాసనమండలి సమావేశాలు జరుగుతూ ఉండటంతో, అధికార పక్షాన్ని నిలదీసింది ప్రతిపక్షం. సిపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తున్నారు. వారం అన్నారు, 18 నెలలు అయ్యింది కదా అని అడిగితే, ప్రభుత్వం తరుపున ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పారు. సిపీఎస్ రద్దు అంశం పై,  మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశామని, వాళ్ళు సమావేశం అవుతున్నారని, తొందర్లోనే ఈ విషయం పై ఒక క్లారిటీ వస్తుందని, ఈ హామీని మేము నెరవేర్చుతామని చెప్పారు. మరి అప్పట్లో వారం రోజుల్లో చేస్తానని, గట్టిగా బలంగా ఎందుకు చెప్పారో, జగన్ గారికే తెలియాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read