ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామంలో స్టేట్ లెవిల్ కాల్‌సెంటర్‌ను ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ బాబు.ఎ. తెలిపారు. శనివారం కలెక్టర్ ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రస్థాయి కాల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ. మాట్లాడుతూ కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి ఫోన్ ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడనున్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కాల్ సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు.

కాల్‌సెంటర్‌కు అవసరమైన సిస్టం, సర్వర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. 18వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రానున్నందున పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచాలని, అవసరమైన డ్రైనేజీ రోడ్డుపనులను పంచాయితీరాజ్ ఇంజనీర్లను చేపడతారని కలెక్టర్ తెలిపారు.

మరోవైపు 750 మంది ఒకేసారిక కూర్చొనే సామర్ధ్యంతో సిటిజన్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సెంటర్ సన్నద్దమవుతుంది. సకల సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత ఈ సెంటర్ సొంతం. కాల్ టాకింగ్ అసోసియేట్లు, మేనేజర్లు, ఎగ్జిక్యూటీవ్లు, ఐటి టీమ్ లీడర్లు ఇలా అన్ని విభాగాలకు కలిపి మొత్తం 1,345 మంది సిబ్బంది ఈ సెంటర్ లో పని చేస్తారు.

ఈ కాల్ సెంటర్ ఎలా పని చేస్తుంది ?

ఇటు ప్రజా సమస్యలు, సలహాలు స్వీకరించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లో తీసుకువెళ్లేందుకు రెండు విధాలుగా ఉపయోగపడతాయి. అవినీతి వేధింపులు లేని సమయపాలన కలిగిన వ్యవస్థను నెలకొల్పేందుకు కాల్ సెంటర్ ఉపకరిస్తుంది. ఏ అధికారి అయినా ప్రజా సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం, లోపాలు సరిదిద్దుకోకపోవడం, అవినీతికి పాల్పడంవంటివి చేస్తే ఈ కాల్ సెంటర్ బయటపెడుతుంది.

 

నేపాల్లో హలో సర్కార్ పేరుతో కాల్ సెంటర్ వ్యవస్థ ఎంతటి ప్రాచుర్యం పొందిందో, రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న సెంటర్ కూడా అంతమంచి పేరు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. కాల్ సెంటర్కు ఒక మంచి పేరు సూచించాలని ప్రజలకు, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read