గన్నవరం టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఆయన అనుచరులు మరో 9మంది పై హనుమాన్‌ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. జంక్షన్ పోలీసుల కథనం ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బావులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నకిలీ ఇళ్ళ పట్టాలు వంపిణీ చేసారన్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేసారు. తాహసీలార్ సంతకం స్టాంపు వేసి ఉన్న నకిలీ ఇళ్ళ పట్టాలను ఎన్నికలకు మూడు రోజుల ముందు పెరికీడులో టిడిపి నాయకులు పంపిణీ చేసారని వైసిపీ ఆరోపణ. దీని పై వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమీషను, జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్పట్లో మాజీ జడ్పీటీసి మరి కొంతమంది పై పోలీసులు కేసు నమోదు చేసారు.

vamsi 19102019 2

టిడిపి ఎమ్మెల్యే వంశీ ప్రోద్బలంతోనే నకిలీ పట్టాలు తయారు చేసి వెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో వంపిణీ చేసారని గన్నవరం కు చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ 10.07.19వతేదీ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహసీల్దార్ విచారణ జరిపిన తాహసీల్దార్ నరశింహారావు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన సంగతి వాస్తవమేనని నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాహసీలార్ ఫిర్యాదు మేరకు వంశీ ఆయన అనుచరులు ఓలువల్లి మోహనరంగా, కాట్రు శేషు కుమార్, టిడిపి నాయకులు జాస్తి ఫణీశేఖర్ తదితరులు మొత్తం 9మందిపై ఐపిసి 420, 468 ,472, 171(ఈ), 120(బి) సెక్షన్ల ప్రకారం జంక్షన్ ఎన్ఏ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

vamsi 19102019 3

అయితే దీని పై వల్లభనేని వంశీ సహచరులు మాత్రం, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని అంటున్నారు. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయం పై, వైసిపీ నుంచి గన్నవరం అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట రావు, హైకోర్ట్ లో, వంశీ ని అనర్హుడిగా చెయ్యాలని కేసు వేసారని, ఈ కేసు హైకోర్ట్ లో విచారణకు వచ్చిన టైంలో, నిజానిజాలు తెలుస్తాయని, ఈ లోపే మళ్ళీ తప్పుడు కేసు పెట్టి, ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వంశీ వర్గీయులు అంటున్నారు. వంశీని పార్టీ మారమని ఒత్తిడులు వస్తున్నాయని, వంశీ వీళ్ళ బెదిరింపులకు లొంగకపోవటంతోనే, ఇప్పుడు వంశీని కేసులు పెట్టి టార్గెట్ చేస్తున్నారని, టిడిపి ఎమ్మెల్యేలు అందరి పై, ఇలాగే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read