చంద్రబాబు 6 లక్షల కోట్లు అవినీతి చేసారు అంటూ, పదే పదే చెప్పిన వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, నాలుగు నెలలుగా, ఆ అవినీతిని నిరూపించటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికే అనేక ఎంక్వయిరీలు వేసారు, అనేక కమిటిలు వేసారు, చివరకు కేంద్ర సహాయం కూడా అవసరం అయిన చోట తీసుకున్నారు. నాలుగు నెలలుగా, చంద్రబాబు చేసిన అవినీతి తవ్వుతూనే ఉన్నారు కాని, ఇప్పటి వరకు అయితే ఏమి బయట పడలేదు. చివరకు ఉద్యోగస్తులని కూడా, మీరు చంద్రబాబు పై ఏదైనా ఆధారాలు ఉంటె చెప్పండి అంటూ వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయినా చంద్రబాబు పై కేసు పెట్టటానికి ఏమి దొరకలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో భాగమో ఏమో కాని, అవినీతి పై చంద్రబాబు మీద ఏమి కేసులు పెట్టలేము అనే స్థితికి వచ్చారో ఏమో కాని, ఈ రోజు చంద్రబాబు పై ఒక పోలీస్ కేసు పెట్టరు వైసిపీ ఎమ్మెల్యేలు.

cbn 19102019 2

అదేదో అవినీతి కేసు కాని, మర్డర్ కేసు కాని అనుకునేరు. కాదు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు పై వ్యాఖ్యలు చేసారని, పోలీస్ వ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని, అందుకే చంద్రబాబు పై కేసు పెట్టామని, ఆయన్ను అరెస్ట్ చెయ్యాలని అంటున్నారు, వైసిపీ ఎమ్మెల్యేలు. గుంటూరు జిల్లా ఆరండల్ పేట పోలీసు స్టేషన్లో , చంద్రబాబు పై, కేసు పెట్టారు, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మహ్మద్‌ ముస్తఫా తదితరులు. పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, వర్ల రామయ్య మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు, డీజీపీ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వీరు అన్నారు. చంద్రబాబు, వర్ల రామయ్యను తక్షణం అరెస్ట్ చేయాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు.

cbn 19102019 3

అయితే ఇదే సందర్భంలో, చంద్రబాబు సియంగా ఉండగా, జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం, వీరికి గుర్తు లేవు. చంద్రబాబుని కాల్చేయాలని, చంద్రబాబుని ఉరి వెయ్యాలని, జగన్ చేసిన వ్యాఖ్యల పై మాత్రం, వీరు మాట్లాడటం లేదు. అదే సందర్భంలో, అనేక సందర్భాల్లో, ఏపి పోలీసుల పై నమ్మకం లేదని, జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా, ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వైజాగ్ లో పోలీసులను వేలు పెట్టిన బెదిరించటం, అలాగే నందిగామలో, ఒక కలెక్టర్ ని, నిన్ను కూడా జైలు కూ తీసుకోపోతా అని బెదిరించటం, అన్నీ అందరికీ గుర్తున్నాయి. ఆ సమయంలో జగన్ చేసిన వాటి పై మాత్రం, ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యని వీరు, జరుగుతున్న పరిణామాల పై, పోలీస్ వ్యవస్థలోని కొందరు, మా పై అనవసరంగా కక్ష సాధింపు చేస్తున్నారు అని చంద్రబాబు చెప్తే మాత్రం తప్పు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read