పండుగ పూట కూడా ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి ఆపటం లేదు అంటుంది టిడిపి. నిన్న నరసరావుపేట వెళ్లేందుకు, నారా లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి, ఆయన విజయవాడ వచ్చే వరకు, దాదాపుగా నాలుగు అయిదు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఈ హైడ్రామా సందర్భంగానే, నారా లోకేష్ ని, కనకదుర్గమ్మ వారధికి, విజయవాడ నుంచి వెళ్ళే సమయంలో, ట్రై జంక్షన్ వద్ద, లోకేష్ కాన్వాయ్ ని నిలిపివేశారు. ఈ నిలిపివేసిన సమయంలో, నారా లోకేష్ వాహన శ్రేణి నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్థంబించింది. అయితే ట్రాఫిక్ స్థంబించటం, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అని, నారా లోకేష్ తో పాటుగా, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత పైన కూడా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీలోని సెక్షన్ 34, సెక్షన్ 186, సెక్షన్ 269 సెక్షన్ల కింద, అలాగే మరి కొన్ని సెక్షన్ల కింద కూడా నారా లోకేష్ పై కేసు నమోదు చేసారు. ముఖ్యంగా నారా లోకేష్ హైవే పైన ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, నిన్న రాత్రి ఈ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. దీని పై ఈ రోజు మీడియాకు సమాచారం అందించారు.

police 10092021 2

అయితే నిన్న పోలీసులు, నారా లోకేష్ కు 41ఏ కింద నోటీసులు జారీ చేసారు. ఆ తరువాత అక్కడ నుంచి పోలీసులు ఉండవల్లిలో ఉన్న నివాసానికి తరలించారు. ఆ తరువాత లోకేష్ మీడియా సమావేశం పెడతాం అని చెప్పినా, మొదట మీడియాను కూడా పోలీసులు కరకట్ట వైపుకు అనుమతి ఇవ్వకపోవటంతో, మళ్ళీ టైం మార్చి మీడియా సమావేశం పెట్టారు. మొత్తం మీద నిన్న ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి, చివరకు ప్రెస్ మీట్ వరకు, పోలీసులు ఈ సంఘటనలు మొత్తం సమీక్ష చేసిన తరువాత, నారా లోకేష్ తో పాటుగా, వంగలపూడి అనిత పైన కేసులు నమోదు చేసారు. అయితే దీని పై టిడిపి నేతలు స్పందిస్తూ, ఇది ఊహించిందే అని అంటున్నారు. లోకేష్ కు ఉండేది మూడు వాహనాలు అని, దానికి పోలీసులు చేసిన హంగామా వాళ్ళ వెహికల్స్ ఇవన్నీ కలిపి, వారే వెహికల్ కు అడ్డు పెట్టి, ఇప్పుడు ఎదురు కేసులు పెట్టటం పై, ఆశ్చర్యం ఏమి లేదని, ఇది మేము ఊహించిందే అని టిడిపి నేతలు అంటున్నారు. ఈ విషయం పై కోర్టులోనే తేల్చుకుంటాం అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read