టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుడివాడ కేసినోలో పాల్గొన్న చీర్ గర్ల్స్ ప్రయాణ వివరాలు బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ "పేకాట రాయుడు, జూద బ్రహ్మ కొడాలి నానీ గుడివాడ నగరాన్ని అపవిత్రం చేశారు. రాష్ట్రమంతా అట్టుడికిపోయేలా చేశారు. ఇది తెలుగు సంస్కృతిపై దాడి జరిగినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలోకి విష సంస్కృతిని తీసుకొచ్చారు. దీనికి ముఖ్య కారణం కొడాలి నానినే. ఈ విషయం రాష్ట్రమంతటికి, ఇతర రాష్ట్రాలకు తెలిసినా ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. వీరు క్యాసియో జరిగిందా లేదా అని ఇంకా అనుమానపడుతున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఇంకా అనుమానిస్తోంది. ఇంటలిజెన్స్ విభాగం, స్పషల్ బ్రాంచ్ ఆఫీసర్స అంతా ఏం చేస్తున్నారు? బాధ్యతాయుత మంత్రి ఏం చేస్తున్నారు? కేసినో జరిగినదాన్ని విచారణ చేయడానికి ఒక డిఎస్పీ ఇంకో డిఎస్పీని పెట్టడం హాస్యాస్పదం. కే కన్వెన్షన్ లో క్యాసినో జరగిందంటే పోలీసు వ్యవస్థ ఎందుకు అనుమానిస్తోంది? క్యాసినో జరిగిన విధానం, ఛీర్ గర్ల్స్ డ్యాన్సింగ్, రోలెట్ రన్నింగ్, తీన్ పత్తి ప్లేయింగ్, అందర్ బాహర్, జనాలు నానీ నానీ అని సినిమా పాటలా పాడటం, డ్యాన్సులు చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రతి టీవీ ఛానల్ లో చూపించారు. ఆఖరికి టీవీ 9 లో కూడా చూపారు. అక్కడి వాతావరణమంతా వైసీపీ కలర్స్ తో డెకరేషన్ చేశారు. అక్కడ వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ఇవన్నీ చూసికూడా అనుమానమా? క్యాసినో జరగలేదని చెబితే డీజీపీ భవిష్యత్తులో దెబ్బతింటారు. ఎవరికో భయపడో, ఎవరికో సాయం చేయాలనో, ఎవరి మెప్పో పొందాలనో డైరెక్టర్ జనరల్ సవాంగ్ అబద్ధం చెబితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. నా పై ఒక తప్పుడు కేసు కూడా పెట్టారు. గోవాలోని క్యాసినో రన్నర్స్ గుడివాడకు వచ్చారు. మూడు రోజులు వారి ఫేస్ బుక్కుల్లో క్యాసినో జరుగుతుందని వారి ఫేస్ బుక్కుల్లో పెట్టుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ లో ఇవన్ని వివరంగా చూపారు. ఆ కోణంలో దర్యాప్తు చేశారా? విచారించి నిజాలు చెప్పమని సీఎం ఎందుకు ఆదేశించడంలేదు? ఇంటలిజెన్స్ వారిని ఎందుకు అడగడంలేదు? ఇంత అభాసుపాలైన మంత్రి ఎక్కడ ఉండరు. సీఎం, డీజీపీకి తెలియని విషయాలు నేను ఇంట్లో ఉండే కనుక్కున్నాను. మీ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? క్యాసినో కార్యక్రమం నిర్వహించాలని నాలుగు నెలల నుంచి జరుగుతున్న తతంగం. రాష్ట్రంలోకి విష సంస్కృతి రావడానికి కారణం కొడాలి నానినే.

నాలుగు నెలల నుంచి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన వ్యక్తులెవరో ప్రభుత్వం కనుక్కోవాలి. క్యాసినో ఆడేవారికి 50 వేలు ప్యాకేజీ పెట్టారు. ఎయిర్ పోర్టులో దిగగానే కారు ప్రొవైడ్ చేశారు. విజయవాడ లాడ్జ్ లో పెట్టారు. అదే కారులో క్యాసినో ఆడే స్థలానికి తీసుకెళ్లారు. 3 రోజులు ఫ్రీ ఎంట్రీ. కొన్ని వేల మంది వచ్చారు. విజయవాడలోని అనేక లాడ్జీలు ఫుల్ అయ్యాయి. మంత్రి, అతని అనుచరుల ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. యదేచ్ఛగా వచ్చి క్యాసినో ఆడుకున్నారు. కొడాలి నానీ తనకు తెలియదని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఫ్రెష్టేషన్ కు లోనై ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. తప్పు చేసి కంగారు పడ్డాడు. నానీని ఇలాగే కొనసాగిస్తే ఈ బురద సీఎం కు కూడా అంటుకుంటుంది. కొడాలి నానీ, కొందరు పోలీసు అధికారులు ఫ్లడ్ లైట్ ల వెలుగులో క్యాసినో నిర్వహించి దాగుడు మూతలాడుతున్నారు. సీఎంకు కూడా ఇందులో భాగముంది. క్యాసినో జరగలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్పీని పంపి ఆపించానని నాని చెప్పారు. డిఎస్పీ అక్కడికి వెళ్లి ఛీర్ గర్ల్స్ పై చర్యలు తీసుకున్నారా? అరెస్టు చేశారా? ఎక్కడైనా ఇద్దరు పేకాట ఆడుతుంటే అక్కడ పేకాట ఆడేవారిని, చుట్టు ఉన్నవారిని, వారి బండ్లను, వారి ఫోన్లను ఇతరత్రా అన్నింటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదే? డ్యాన్సులు జరుగుతున్నాయని తెలిసి డిఎస్పీని పంపానంటే యువతులతో ప్రదర్శన జరిగినట్లుగా నానీ ఒప్పుకున్నట్లే. అక్కడికి వెళ్లిన డిఎస్పీ అందరినీ ఎందుకు అరెస్టు చేయలేదు? క్యాసినోను ఎందుకు సీజ్ చేయలేదు? నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కవిరాజు త్రిపురనేని రామాస్వామి చౌదరి, హనుమాన్ చౌదరి, గంటశాల వెంకటేశ్వరరావు లాంటి మహామహులు పుట్టిన గుడివాడ పట్టణాన్ని ధనాశ, దురాశతో, దుష్ట ఆలోచనలతో కళంకం చేశారు. క్యాసినో ఆడేవారు ఎన్ని లాడ్జీల్లో దిగారు, ఎన్ని కార్లు వాడారు విచారణ చేయలేదు. నేను అసభ్యకరంగా మాట్లాడానని నాపై కేసు పెట్టారు. క్యాసినో నానిపై చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి.మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read