వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అడ్డంగా దొరికిపోయిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విష‌యంలో నాట‌కీయ‌ప‌రిణామాల‌కు పాల్ప‌డుతున్న సీబీఐ విశ్వ‌సనీయ‌త దారుణంగా దెబ్బ‌తింది. ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాని అరెస్టు చేసిన ఇదే సీబీఐ, వివేకా హ‌త్య‌లో కీల‌క సూత్ర‌ధారి అవినాష్ రెడ్డేనని అన్ని ఆధారాలు చిక్కినా అరెస్టు చేయ‌కుండా వేడుక చూస్తుండ‌డం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సీబీఐ ప‌లుచ‌న అయిపోయింది. సీబీఐపై కామెడీ పోస్టులు సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సీబీఐ అంద‌రినీ అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుతూ, ఆయ‌న అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కేసుల‌న్నీ మ‌రిచిపోయింద‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. 42వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోపిడీ చేశాడ‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై 31కి పైగా చార్జిషీట్లు దాఖ‌లు చేసిన సీబీఐ, ఈడీలు ప‌దేళ్లయినా ద‌ర్యాప్తు పూర్తి చేయ‌లేదు. ఇదే అద‌నుగా వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసుకుంటూ, డిశ్చార్జి పిటిష‌న్లు వేసుకుంటూ కేసులు విచార‌ణ‌కి కూడా రాకుండా చేసుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వైట్ కాల‌ర్ నేర‌స్తుల‌కి రోల్ మోడ‌ల్ గా నిలిచార‌ని న్యాయ‌కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసుల హాజ‌రు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మిన‌హాయింపు ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంత‌రం రోజువారీ విచారణ కూడా సీబీఐ కోర్టులో జ‌రుగుతున్న దాఖ‌లాలు క‌న‌ప‌డ‌లేదు. తీవ్ర‌నేరారోప‌ణ‌లున్న రాజ‌కీయ‌నేత‌ల‌పై కేసుల విచార‌ణ ఏడాదిలో పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై న‌మోదు అయిన సీబీఐ కేసులు ప‌దేళ్లు దాటిపోతున్నా, ఇప్ప‌టికీ కొలిక్కి రాలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read