పిల్లి గుడ్డిదైతే ఎల‌క ముడ్డి చూపింద‌ని సామెత‌. ద‌ర్యాప్తు చేసే సీబీఐని మేనేజ్ చేయ‌గ‌లిగితే అన్న దొరికితే, నిందితుడైన త‌మ్ముడు ఎన్ని వేషాలైనా వేస్తాడ‌నేదానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అనుమానితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో దాగుడుమూత‌లు ఆడుతున్నాడు. సీబీఐ విచార‌ణ‌కి రావాల‌ని ఆదేశిస్తే  త‌న‌కు వీలుకాద‌ని లేఖ రాసిన అవినాష్ రెడ్డి తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  త‌న‌కు షార్ట్ నోటీసుతో విచారణకు పిలిచారని లేఖ‌లో వివ‌రించిన అవినాష్ రెడ్డి తాను విచార‌ణ‌కి హాజ‌రు కాలేన‌ని పేర్కొన్నాడు.  వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నాన‌ని, అత్యవసర పనులు ఉన్నాయని సీబీఐకి లేఖ‌లో కోరాడు.  విచార‌ణ‌కి హాజ‌రు కావాలంటే నాలుగు రోజులు సమయం కావాలని కోరాడు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన సీబీఐ అధికారులు,  వెంటనే విచారణకు హాజరుకావాలని ఆదేశించార‌ని స‌మాచారం. అవినాష్ లెటర్ పై ఢిల్లీ సీబీఐ హెడ్ క్వార్ట‌ర్స్ కి సమాచారం ఇచ్చిన ద‌ర్యాప్తు అధికారులు వారి ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. చివరకు మళ్ళీ విచారణ 19వ తేదీకి వాయిదా వేసారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read