ప్రతి శుక్రవారం తాను కోర్ట్ కు రావటం కుదరదు అని, నేను ఇప్పుడు సియంని అని, చాలా బాధ్యతలు ఉంటాయని, అందుకే తనకు ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రిందట సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. జగన్ వేసిన పిటీషన్ పై ఈ రోజు సిబిఐ కోర్ట్ విచారణ జరిపింది. అసలు ముందు ఈ పిటీషన్ పై విచారణ అర్హత ఉందొ లేదో చూడాలి అంటూ, సిబిఐ కోర్ట్ విచారణ ప్రారంభించింది. ఈ నేపధ్యంలో సిబిఐ కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఇది వరకే, ప్రతి శుక్రవారం కోర్ట్ కి రాకుండా మినహాయింపు ఇవ్వమని కోరారు, కాని మీకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం కుదరదు అని గతంలో హైకోర్టు చెప్పింది కదా. మీరు వ్యక్తిగత మినహాయింపు కోసం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది కదా అని ఈ రోజు సిబిఐ కోర్ట్ ప్రశ్నించింది.

cbi 20092019 2

ఒకసారి హైకోర్ట్ కొట్టేసిన విషయంతో, మళ్ళీ మీరు సిబిఐ కోర్ట్ ను ఆశ్రయించారు, ఇదే పిటిషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసినందున మళ్లీ ఎలా విచారణ చేపడతాం అంటూ సీబీఐ న్యాయస్థానం, జగన్ తరుపు లాయర్లను ప్రశ్నించింది. దీని పై స్పందించిన జగన్ తరుపు లాయర్లు, ఇప్పుడు తమ పరిస్థితులు మారిందని, అందుకే ఇప్పుడు తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. జగన్ తరుపు న్యాయవాడులు విజ్ఞప్తి మేరకు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు సిబిఐ న్యాయస్థానం పెర్కుంది. దీంతో జగన్ తరుపు న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు. దీని పై త్వరలోనే వాదనలు జరగనున్నాయి.

cbi 20092019 3

అయితే ఈ పిటీషన్ పై సిబిఐ కోర్ట్ ఎలా తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది. జగన్ మొహన్ రెడ్డి చెప్పిన కారణం, తాను ముఖ్యమంత్రి అని, తనకు ఎన్నో పనులు ఉంటాయని, అలాగే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని, తాను హైదరాబాద్ వస్తే, తనతో పాటు, పోలీసులు అంతా రావాల్సి ఉంటుందని, భద్రత చూసుకోవాలని, ఇవన్నీ రాష్ట్ర ఆదాయం పై ఎంతో ప్రభావం చూపుతాయని పిటీషన్ లో పెర్కున్నారు. అయితే కొంత మంది న్యాయ నిపుణులు చెప్తుంది మాత్రం, ఇందుకు భిన్నంగా ఉంది. సహజంగా చట్టం ముందు ఎవరైనా సమానమే అని, సియంకు ప్రత్యెక హోదాలు న్యాయస్థానం ముందు ఉండవని అంటున్నారు. అలాగే, సొంత ఖర్చులు పెట్టుకుని రావచ్చు కదా అని కోర్ట్ అంటే, అప్పుడు జగన్ ఏమి సమాధానం చెప్తారని న్యాయ నిపుణులు అడుగుతున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read