జగన్ మోహన్ రెడ్డికి ఒక వైపు పరిపాలనలో ఎదురు దెబ్బలు తగులుతూ, చికాకు పెట్టిస్తుంటే, మరో పక్క, తన వ్యక్తిగతంగా ఉన్న కేసులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో, జగన్ మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళాల్సి ఉన్న విషయం తెలిసిందే. 12 చార్జ్ షీట్లలో జగన్ మోహన్ రెడ్డి, అభియోగాలు ఎదుర్కుంటున్నారు. 43 వేల కోట్లు అక్రమంగా కొల్లగొట్టినట్టు, సిబిఐ కూడా ప్రాధమికంగా తేల్చి, కోర్ట్ లో పెట్టింది. దీనిలో భాగంగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం విచారణకు వెళ్తున్నారు. అయితే ఆయన గత ఏడు నెలలుగా విచారణకు హాజరు కాకపోవటంతో, కోర్ట్ ఆగ్రహం చెందటంతో, పోయిన శుక్రవారం కోర్ట్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు, ముఖ్యమంత్రిగా ఉంటూ, కోర్ట్ కు వెళ్ళిన వారు ఎవరూ లేరు. దేశంలో కూడా, లాలూ, మధు కోడా తరువాత, జగన్ మోహన్ రెడ్డి, ఇలా ముఖ్యమంత్రిగా ఉంటూ కోర్ట్ కు వెళ్లారు. అయితే, ఇప్పుడు మరోసారి శుక్రవారం రావటంతో, జగన్ కోర్ట్ కు వెళ్తారా లేదా, అనే టెన్షన్ నెలకొంది.

cbi 17012019 2

అయితే, ఈ రోజు జగన్ కోర్ట్ కు వెళ్ళలేదు. ఈ రోజుకి వ్యక్తిగత మినహాయింపు కోరాటంతో, ఈ ఒక్క రోజుకి కోర్ట్ మినహాయింపు ఇచ్చింది. మరో పక్క, ఈ రోజు పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించి కోర్ట్, విచారణ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులు హాజరు కావాలని కోర్ట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ రోజు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీని పై ఇంకా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. తనకు సంబధించిన 5 ఛార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలంటూ ఆయన కోర్ట్ కు పిటీషన్ పెట్టుకున్నారు. అయితే కోర్ట్ దాన్ని తిరస్కరించింది.

cbi 17012019 3

ఇవన్నీ వేరే వేరే కేసులు అని, అన్నిటికీ ఒకటే విచారణ చెయ్యలేమని చెప్పింది. ఇది జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, 5 ఛార్జిషీట్లు కలిపి విచారిస్తే, జగన్ తప్పు చేసారని తేలితే, ఒకే శిక్ష ఉంటుంది. కాని ఇప్పుడు కోర్ట్ అన్నీ వేరే వేరే విచారణ చేస్తాం అని చెప్పటంతో, జగన్ తప్పు చేసారని తేలితే, ప్రతి చార్జ్ షీట్ కు శిక్ష ఉంటుంది. లాలూ కేసులో ఇది జరిగింది. ఇక మరో అభ్యర్ధన కూడా కోర్ట్ తిరస్కరించింది. సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే జగన్ వేసిన, మరో పిటిషన్ కూడా కోర్ట్ తిరస్కరించింది. దీంతో జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు సిబిఐ కోర్ట్ కు వెళ్తున్న జగన్, ఇక ఈడీ విచారణ కూడా మొదలైతే, దానికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి, జగన్ కేసులు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read