వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంపై శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణకు ఎంపీ విజ యసాయిరెడ్డి, తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, ఆడీఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ హాజరయ్యారు. అనుబంధ చార్జిషీట్ను గతంలో సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో పలువురు నేతలు, అధికారులకు సమన్లు జారీ అయ్యా యి. సీబీఐ రెండేళ్ల క్రితమే అనుబంధ చార్జిషీట్ ను దాఖలు చేసినా హైకోర్టు స్టే విధించ డంతో గతంలో విచారణ నిలిచిపోయింది. తాజాగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో స్టే తొలగించడంతో దానిపై మళ్లీ విచారణ మొదలైంది. అయితే అనుబంధ చార్జిషీట్లను స్వీకరిం చవద్దంటూ జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్ఫో ర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చారు.

jagan 18012020 2

తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు మొదటి చార్జిషీటు దాఖలు చేశామని, తర్వాత మరిన్ని వివరాలు వెలుగుచూడడంతో అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేశామని వారు పేర్కొన్నారు. చట్టప్ర కారం ఎప్పుడు కీలక సమాచారం లభించినా దానికి అనుగుణంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని వారు పేర్కొ న్నారు. గతంలో అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంటు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహా రాల్లో అవకతవకలు జరిగాయని అనుబంధ చార్జీ షీలో సీబీఐ పేర్కొంది. అప్పుడు గనుల మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించగా, రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద వీరంతా నేరానికి పాల్పడినట్టు సీబీఐ అనుబంధ చార్జిషీట్ లో పేర్కొంది.

jagan 18012020 3

కాగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోర్టు ముందు హాజరయ్యారు. సీఎం హోదాలో జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు గత వారం తొలి సారి హాజరయ్యారు. సీబీఐ కేసు తేలేంత వరకూ ఈడీ కేసుల విచారణ నిలిపివేయాలని, సీబీఐ ఐదు చార్జిషీట్లనూ ఒకేమారు విచారించాలని జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు చేసిన వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి జగన్మోహన్ రెడ్డిని మినహాయించా లని న్యాయవాదులు కోరారు. అయితే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి కోర్ట్ కు రాకుండా, తనకు హై పవర్ కమిటీతో మీటింగ్ ఉందని చెప్పటంతో, కోర్ట్ ఈ ఒక్క వారానికి మినహాయింపు ఇచ్చింది. అనంతరం తదు పరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read