ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయట నుంచి జరిగే విచారణలు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా కోర్టు ఆదేశాలు ప్రకారం, అలాగే రాష్ట్ర పోలీసులు పై నమ్మకం లేక ఫిర్యాదులు చెయ్యటం, ఇలాంటి వాటితో బయట నుంచి వచ్చి ఎంక్వయిరీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పలు కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇవ్వగా, మరో నాలుగు కేసులు వరకు సిబిఐకి ఇచ్చారు. అలాగే ఈ రోజు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చేత విచారణకు ఆదేశించారు, ఇక శిరోమండనం కేసులో రాష్ట్రపతి కల్పించుకుని, డైరెక్ట్ గా విచారణ అధికారీని నియమించి, వివరాలు ఇవ్వమన్నారు. రాష్ట్రంలో ఇలా జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు సిబిఐ మరో కేసులు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సిబిఐ వైఎస్ వివేక కేసు, డాక్టర్ సుదాకర్ కేసులో విచారణ జరుపుతూ ఉండగా, ఇప్పుడు గుంటూరు పోలీసులు పై సిబిఐ కేసు పెట్టి విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, సిబిఐ ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుంది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పరిధిలో, క్రికెట్ బుకింగ్ కేసు వ్యవహారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గుంటూరు సిసియస్ పోలీసులు, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అంటూ ముగ్గురు వ్యక్తులను నిర్బంధించారు అంటూ, 2019 అక్టోబర్ నెలలో, ఆ ముగ్గురుకు సంబందించిన కుటుంబ సభ్యులు హైకోర్టు లో తమ వారిని అక్రమంగా నిర్బందించారని, అరెస్ట్ అయిన 24 గంటల్లో కోర్టులో హాజరు పరచుకుండా, కేసు ఒప్పుకోవాలి అంటూ, మూడు రోజులు పాటు నిర్బందించి ఇబ్బందులు పెట్టారని కోర్టుకు తెలపటంతో, హైకోర్టు ఈ విషయం పై రాష్ట్ర పోలీసులు మీదే అభియోగం రావటంతో, సిబిఐ విచారణకు ఆదేశించింది. దీని ప్రకారం, సిబిఐ గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరావు , అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, మరో కానిస్టేబుల్ వీరాంజనేయులుతో పాటు పలువురి సిబ్బంది పై సిబిఐ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read