వివేక కేసు సిబిఐ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేక కేసు ఎంత సంచలనమో, విచారణ జరుగుతున్న పరిణామాలు కూడా అంతే సంచలనంగా మారాయి. ఈ కేసు ముందుగా జగన్ మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలి అన్నారు. తరువాత అధికారంలోకి వచ్చి సిబిఐ విచారణ వద్దని కోర్టుకు తెలిపారు. కుటుంబలో చెల్లి మాత్రం, మాకు నమ్మకం లేదు సిబిఐ విచారణ కావాలి అన్నారు. చివరకు హైకోర్టు ఈ కేసుని సిబిఐకి ఇచ్చింది. తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ, ఈ కేసు విషయంలో నాలుగు విడతలుగా విచారణ చేసింది. అయితే మొదటి మూడు సార్లు ఏదో ఫార్మాలటీగా విచారణ చేసినట్టు కనిపించినా, నాలుగో సారి మాత్రం గట్టిగా విచారణ చేస్తుంది. ఏకంగా 44 రోజులుగా సిబిఐ విచారణ చేస్తుంది. అయితే ఈ కేసులో విచారణా అధికారిగా, డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ను ఈ సారి సిబిఐ నియమించింది. ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు ఉంది. ఆమె ట్రాక్ రికార్డు కూడా, ఎన్నో కేసులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారనే పేరు ఉంది. దీనికి తగ్గట్టే ఆమె, ఈ సారి గట్టిగా రంగంలోకి దిగారు. దాదపుగా 25 మంది సిబిఐ ఆఫీసుర్లు, నాలుగు బృందాలుగా ఏర్పడి, గత 44 రోజలుగా విచారణ చేస్తున్నారు. పలు మార్లు పులివెందులలో వివేక ఇంటికి వెళ్లి అక్కడ కూడా విచారణ చేసారు.

cbi 23072021 2

ఈ సారి కేసు తేలే వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ చెప్పటంతో, కొంత మంది నాయకులకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఎక్కడ తమ బండారం ఆధారాలతో సహా బయట పడుతుందో అని దోషులు భయపడుతూ ఉన్న సమయంలో, వారికి మంచి వార్త ఒకటి వినిపించింది. నిన్న ఉన్నట్టు ఉండి డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ని బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి రామ్ కుమార్ రంగలోకి దిగారు. డిఐజి స్థాయి అధికారి నుంచి, ఈ కేసుని ఎస్పీ స్థాయి అధికారికి సిబిఐ ఎందుకు బదిలీ చేసిందో అర్ధం కావటం లేదు. సిబిఐ కేంద్ర హోం శాఖ కంట్రోల్ లో ఉంటుంది, ఇది హైప్రొఫైల్ కేసు కావటంతో, కేంద్రం వైపు నుంచి ఏమైనా ఒత్తిడి తెచ్చి, ఈ బదిలీ చేసారా అని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఇక్కడ విచారణ చేసి, కేసు ఒక కొలిక్కి వస్తున్న సందర్భంలో, డిఐజి ర్యాంక్ అధికారి సుధా సింగ్ ను సిబిఐ బదిలీ చేయటం, ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం సహజంగా జరిగెదా, లేక ఏమిటి అనేది సిబిఐ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read