కొన్ని రోజుల క్రిందట, రాజకీయ కక్షతో కొంత మంది, లోకేష్ పై సిబిఐ విచారణ కోరుతూ, హైకోర్ట్ కు వెళ్తే, అక్కడ కోర్ట్ కొట్టేసిన విషయం చూసాం. కనీస ఆధారాల్లేకుండా విచారణ ఎలా అని ప్రశ్నించింది. ప్రస్తుతానికి అక్కడ కథ ముగిసింది. అయితే కోర్ట్ కొట్టేసినా, సిబిఐ మాత్రం ఉత్సాహంగా ఉంది. కారణం మీకు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఐటీ, ఈడీ, సీబీఐ అనే మూడు నేత్రాల్లో... ఇప్పటికే ఐటీ, ఈడీ రాష్ట్రంపై దృష్టి సారించాయి. తాజాగా... పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలపై సీబీఐ కూడా కన్ను తెరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పారిశ్రామిక రాయితీలపై బీజేపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడైన ఐటీశాఖ మంత్రి లోకేశ్‌పై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

lokesh 15102018 2

ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి అంగీకరించనప్పటికీ... కేం ద్రం మాత్రం ‘గో ఎహెడ్‌’ అంటూ సీబీఐని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే అంతర్గతంగా ఆరా తీయడం మొదలైందని... త్వరలో సీబీఐ బృందాలు నేరుగా రంగంలోకి దిగుతాయని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడి వర్గాలను భయభ్రాంతులకు గురి చేయడంలో భాగంగానే ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. సీబీఐ కూడా రంగప్రవేశం చేస్తే టీడీపీ, బీజేపీ మధ్య యుద్ధం తీవ్రంకానుంది.

lokesh 15102018 3

ఐటీ కంపెనీలకు కేంద్రం కూడా రాయితీలు అందిస్తోంది. ఐటీ శాఖను స్వయానా లోకేశ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్షాలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలక్ర్టానిక్స్‌, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెద్దగా రావడంలేదని.. బినామీ కంపెనీలకు వందల కోట్ల రూపాయలు రాయితీల పేరిట చెల్లించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఇచ్చి న జీవోలనూ.. సమాచారాన్ని ఇవ్వాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. అయితే... పరిశ్రమ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటిదాకా ఈ ఆరోపణలను పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా రాజకీయంలో భాగమని భావిస్తూ వచ్చారు. ‘‘ఇప్పుడు నేరు గా సీబీఐ రంగంలోకి దిగుతున్నట్లు తెలియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా పారదర్శకంగానే జరుగుతోంది. సీబీఐ దర్యాప్తునకు భయపడాల్సిన అవసరమే లేదు’’ అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read