వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో సీబీఐ సంచ‌ల‌నంగా తెర‌పైకి తెచ్చిన ర‌హ‌స్య‌సాక్షి భ‌ద్ర‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ వద్ద  రహస్య సాక్షి వాంగ్మూలం ఉందని సీబీఐ కోర్టులో చెప్ప‌డంతో మ‌రో సెన్సేష‌న్‌కి తెర‌లేచింది. వివేకా హత్యలో విస్తృత రాజకీయ కుట్ర ఉందని ర‌హ‌స్య సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ తో బట్టబయలైంద‌ని, ప్రస్తుత దశలో రహస్య సాక్షి భ‌ద్ర‌త దృష్ట్యా ఆ పేరు వెల్ల‌డించ‌లేమ‌ని కోర్టుకి చెబుతూనే...కొన్ని అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సీబీఐ. వివేకా హత్యాస్థలానికి చేరుకున్న పోలీస్ శాఖ‌కి చెందిన సీఐ శంకరయ్య, అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఆర్పీసీ 161 స్టేట్‌మెంట్ ఇచ్చార‌ని, మేజిస్ట్రేట్‌ వద్ద సీఆర్పీసీ 164 స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి రాలేదని సీబీఐ తరఫు న్యాయవాదులు తెలిపారు.  ప‌దిరోట్లు తీసుకుని హత్య చేసినట్టు ఒప్పుకోవాలని తనకు ఆఫర్‌ ఇచ్చారని చెప్పిన గంగాధర్‌రెడ్డి చనిపోయాడని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తాము రహస్య సాక్షి పేరును సరైన సమయంలో చార్జిషీట్‌లో చేరుస్తామని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి సీబీఐని క‌లిసి స్టేట్మెంట్ ఇచ్చింది ష‌ర్మిలేన‌ని, ఆమె ప్రాణాల‌కు ముప్పు త‌ల‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని సీబీఐ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ ఎటువంటి బ‌ల‌మైన ఆధారాలు లేవ‌ని అవినాష్ రెడ్డి హ‌స్తం ఉంద‌ని చూపించేలా లేవ‌ని వాదిస్తూ వ‌చ్చిన ఆయ‌న న్యాయ‌వాదులు ర‌హ‌స్య‌సాక్షి దెబ్బ‌తో తీవ్రమైన టెన్ష‌న్‌లో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read