అంద‌రూ అనుమానించిందే జ‌రిగింది. వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసుని ద‌ర్యాప్తు చేస్తున్న రాంసింగ్ బ‌దిలీ చేయాల‌ని మొద‌టి నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు డిమాండ్ చేస్తోంది. రాంసింగ్ పై గ‌తంలో అవినాష్ మ‌నుషులు కేసులు కూడా పెట్టారు. పులివెందుల వ‌దిలి వెళ్లిపోవాల‌ని సీబీఐ అధికారి డ్రైవ‌ర్‌నీ బెదిరించారు. చివ‌రికి ద‌ర్యాప్తు అధికారిని మార్చాల‌ని కోర్టుకెక్కి విజ‌యం సాధించారు. వివేకానంద రెడ్డి హ-త్య కేసు దర్యాప్తున‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఇచ్చింది. ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ హ-త్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాల‌ని సూచించింది. అనుమానితులు కోరుకున్న‌ట్టే సీబీఐ అధికారి రాంసింగ్ లేకుండా కొత్త సిట్‌ ని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ముందు ఉంచింది. కొత్త సిట్‌లో ఎస్పి వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముకేష్‌ కుమార్‌, ఇన్స్పెకర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, సబ్‌ ఇన్స్పెక్టర్‌ అంకిత్‌ యాదవ్‌లు సిబిఐ డిఐజి కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో ప‌నిచేస్తారు. దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను సిబిఐ తప్పించింది. ఆరు నెలలోపు ట్రయల్‌ మొదలుకాక పోతే... శివశంకర్ రెడ్డి ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని, వివేకా హ‌-త్య‌కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచార‌ణ అధికారి రాంసింగ్ ని త‌ప్పించినా, అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ కి ద‌ర‌ఖాస్తు చేయ‌డంతో అరెస్టుని ఆప‌లేక‌పోవ‌చ్చ‌ని, ద‌ర్యాప్తుని ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాల్సి ఉన్నందున మూడుసార్లు విచార‌ణ‌కి వ‌చ్చిన అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read