వైఎస్ వివేక హత్య కేసు, హైకోర్టు ద్వారా సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సిబిఐ కొన్ని రోజులు విచారణ చేసి, ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ 40 రోజులు తరువాత, సిబిఐ ఢిల్లీ నుంచి పులివెందుల చేరుకొని, రెండో విడత విచారణ మొదలు పెట్టింది. జూలై నెలలోని మొదటి వారంలో, దాదపుగా 15 రోజులు పాటు, కడపలో, అలాగే పులివెందులలో కూడా చాలా మందిని సిబిఐ విచారించింది. గతంలో సిట్ చేసిన విచారణ వివరాలు మొత్తం సిబిఐ తీసుకుని, చాలా మంది సాక్ష్యులని, హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారిని, ముందుగా ఘటనా స్థాలానికి వచ్చిన పోలీసులను, వివేక కూతురుని, ఇలా అనేక మందిని, దాదాపుగా 15 రోజులు పాటు సిబిఐ విచారణ జరిపింది. అయితే ఉన్నట్టు ఉండి సిబిఐ ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చే వారం వస్తారని అందరూ భావించినా, సిబిఐ మళ్ళీ తిరిగి రాలేదు. నెల రోజులు గడుస్తున్నా సిబిఐ రాకపోవటంతో, విచారణ ఏమైందా అనే వ్యాఖ్యలు వస్తున్న వేళ, దాదాపుగా 40 రోజులు తరువాత మళ్ళీ సిబిఐ తిరిగి వచ్చింది.

ఢిల్లీ నుంచి నేరుగా పులివెందుల చేరుకున్న సిబిఐ బృందం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో బస చేసారు. విచారణ జరిగిన తీరు, తరువాత ఎవరిని విచారించాలి, విచారణ తీరు ఎలా సాగాలి అనే దాని పై చర్చించారు. ఈ సారి విచారణలో, రాజకీయ ప్రముఖులని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీ ప్రముఖులు, కొంత మంది ప్రజా ప్రతినిధుల పేర్లు వినపడుతున్న సమయంలో, వారిని ఈ సారి విచారణకు పిలిచే అవకాసం ఉంది. మరి ఈ సారి విడతలో విచారణ పూర్తి చేస్తారా ? లేదా విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ? ఇప్పటికే సిబిఐ ఒక అంచనాకు వచ్చిందా ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నాయి. కేసు విచారణ, హైకోర్టు ద్వారా, సిబిఐకి రావటంతో, సిబిఐ విచారణ మొత్తం, హైకోర్టుకే ఇచ్చే అవకాసం ఉంది. ఎప్పటికి విచారణ పూర్తి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read