ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క టికెట్ రేట్లు తగ్గించటం, మరో పక్క ఆన్లైన్ టికెట్లు, ఇలా రకరకాలుగా, సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. కొంత మందిని సెలెక్టెడ్ గా టార్గెట్ చేసుకుని, ప్రభుత్వం ఇలా చేస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే విచిత్రంగా, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఈ అంశం పై సీరియస్ గా ముందుకు వచ్చి, జగన్ ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు, వచ్చి కలుస్తున్నారు. చిరంజీవి ఒకసారి, దిల్ రాజు ఒకసారి, రాం గోపాల్ వర్మ, ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వస్తున్నారు. అయితే ఈ ప్రధాన అంశం పై, తెలుగుదేశం పార్టీ పెద్దగా స్పందించ లేదు. అయితే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు సినిమా వాళ్ళతో ఆడిస్తున్నాడని, సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు సామాజిక వర్గం వారు ఉన్నారు అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈ అంశం పైన ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తూ, సినిమా ఇండస్ట్రీ ఏదో మాకు అనుకూలం అన్నట్టు మాట్లాడుతున్నారని, వారు ఎప్పుడూ తమకు వ్యతిరేకంగానే పని చేసారని అన్నారు.

cbn 11012022 2

ఆయన ఏమన్నారు అంటే, "నిన్న మొన్నా చూస్తున్నా, ఏమి మాట్లాడుతున్నారో. సినిమాల పైన మాట్లాడుతూ, మమ్మల్ని లాగుతారు. ఒక పద్దతి కూడా లేదు వీళ్ళకు. ఆ మాట్లాడే తీరు కూడా లేదు. నేను ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే చేసారు. ఎప్పుడూ కూడా నాకు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే, మేమే వచ్చే వాళ్ళం కదా ప్రభుత్వంలోకి, అందరూ అంటారుగా ఆ మాట. నేనేమీ మాట్లాడలేదే. ఆయన పార్టీ పెట్టినా, నేను తెలంగాణాలో అలయన్స్ పెట్టినా, నేను అధికారంలోకి రాలా. ఇవన్నీ కొన్ని జరిగాయి. దానికి నేను చిరంజీవి మీద కోపం తెచ్చుకోలా. అంతకు ముందు ఆయన నాకు ఫ్రెండ్. తరువాత రాజకీయంగా విబేధించాం. ఇది పార్ట్ అఫ్ ది గేం. ఎప్పుడూ ఆయన మీద కక్ష లేదు. మనం చేయాల్సిన పని మనం చేసాం, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చిరంజీవి నాతొ బాగున్నాడు. నా పైన వ్యతిరేకంగా చాలా మంది సినిమాలు తీసారు. ముందు తీసారు, ఇప్పుడు తీసారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా మీద వ్యతిరేకంగా తీసారు. ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవటం ముఖ్యం. బెదిరింపుల ద్వారా, బ్లాక్ మెయిల్ ద్వారా, ప్రభుత్వ అధికారంతో, వాళ్ళని అణిచి వేయటం చాలా ఘోరం. సినిమా వాళ్ళని, రాజకీయ నాయకులని, సోషల్ ఆక్టివిస్ట్ లని, చివరకు కామన్ మ్యాన్ పైన కూడా వచ్చేసారు. ఇవన్నీ తట్టుకునే వాళ్ళు నిలబడుతున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read