తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, అన్యమతస్తుల వ్యవహారం మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. హిందువులు కాకుండా, వేరే మతం ఆచరించే వారు, కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోవాలి అనుకుంటే, గతంలో ఉన్న చట్టాలు ప్రకారం, అన్యమతస్తులు, తమకు స్వామి వారి మీద నమ్మకం, విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనం చేసుకోవాలి. అయితే జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళిన ప్రతి సారి డిక్లరేషన్ ఇవ్వకుండా, స్వామి వారిని దర్శించుకోవటం చర్చకు దారి తీస్తుంది. గతంలో రాష్ట్రపతిగా పని చేసిన అబ్దుల్ కలాం కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో సోనియా గాంధీ కానీ, ఇలా అనేక మంది స్వామి వారి పట్ల తమకు విశ్వాసం ఉందని, డిక్లరేషన్ ఇచ్చే వారు. అయితే జగన్ మోహన్ రెడ్డికి, స్వామి వారి పట్ల నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వటానికి బాధ ఏమిటి అంటూ, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ తిరుమల వెళ్లి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వటానికి వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ మొదలైంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఈ విషయం ప్రస్తావించారు.

దీంతో అందరూ ఇదే మాట్లాడుకోవటం, అసలు ఒక డిక్లరేషన్ ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి అనే చర్చ జరుగుతూ ఉండటంతో, దీని పై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదు అంటూ, గతంలో ఉన్న రూల్స్ ని మార్చేస్తూ, ప్రకటన చేసారు. మనసులో విశ్వాసం ఉంటే చాలని, డిక్లరేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా మార్చేస్తారు, అందులోను ఇది చట్టం అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇక ఇదే విషయం పై చంద్రబాబు స్పందించారు. జగన్ కోసం సంప్రదాయాలు మార్చేస్తారా ? పాలకులు మారిన ప్రతిసారి సంప్రదాయాలు మార్చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వామి వారి పట్ల అన్యమస్తులకు నమ్మకం ఉంది అని చెప్పటానికి డిక్లరేషన్ ఇస్తారు, దాన్ని ఈ నమ్మకం లేని వ్యక్తి కోసం మార్చేస్తారా, ఇది సమాజానికి అరిష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read