తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి కుడి చేతికి కట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి చంద్రబాబు చేతికి కట్టుతో హాజరయ్యి, కార్యకర్తలను కంగారు పెట్టారు. అయితే, ఆయన కుడి చేతి నరం పై ఒత్తిడి పెరిగిందని, దానికి నొప్పి రావటంతో ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని, దీంతో చేతికి మరింత ఒత్తిడి పెరగకుండా, చేతికి కట్టులాగా కట్టి, సపోర్ట్ గా ఉంచారని, తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. నొప్పి మరీ ఎక్కవుగా ఉండటంతో, చంద్రబాబుని రెండు రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారని, అందుకే చంద్రబాబు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చారని తెలియటంతో, తెలంగాణా తెలుగుదేశం నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు కూడా చంద్రబాబుని కలిసారు.

cbn 145082019 2

రాఖీ సందర్భంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుని కలిసి రాఖీ కట్టారు. పార్టీలు వేరు అయినా, చంద్రబాబు మీద అభిమానం ఎప్పటికీ చచ్చిపోదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి చేతి కట్టు పై అక్కడ నాయకులు ఆందోళన వ్యక్తం చెయ్యటంతో, వారికి చంద్రబాబు సమాధానం చెప్తూ, ఇది చాలా చిన్న విషయం అని, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాని చెప్పారు. ఇటీవలే అమెరికాకి వెళ్లి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేపించుకున్నానని, ఎప్పటికి మీద ఈ సారి రిపోర్ట్ లు బాగున్నాయని, నా ఆరోగ్యం గురించి ఎటువంటి ఆలోచన పడాల్సిన పనిలేదని చంద్రబాబు అన్నారు. చేతికి కొంచెం ఒత్తిడి తగలటంతో, ఇబ్బందిగా ఉందని అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.

cbn 145082019 3

ఇక మరో పక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నిన్న ఏకంగా జపాన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరం రాయటంతో, చంద్రబాబు స్పందించారు. ఒక పక్క కేంద్రం చెప్తుంది, ఒక పక్క కోర్ట్ లు చెప్తున్నాయి, ఇప్పుడు విదేశాలు కూడా చెప్తున్నాయని, అయినా జగన్ మొండిగా వెళ్తున్నారని, పేరులో సగం ఉంటే, తన చేష్ట,లతో, మరో సగం మొండితనం కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. "విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష మంచిది కాదని, రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి చెప్పారు, వినలేదు. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి చెప్పారు, వినలేదు. ఇప్పుడు జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు లేఖ రాసింది. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉంది. రాష్ట్రం దాటి, దేశం దాటి, జగమంతా వారికి హితవాక్యాలు చెబుతుంటే... బహుశా ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో! పిచ్చికి అనేక రూపాలు మరి." అంటూ చంద్రబాబు స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read