చంద్రబాబు ఏదైనా కొత్త పధకం కాని, ఉన్న పధకాలను పెంచటం కాని చేస్తున్నారు అంటే, ముందుగానే పేపర్ లో, మీడియాలో నెల రోజుల ముందు నుంచే ప్రచారం చేసేవారు. ప్రాధమికంగా దాని గురించి చర్చ జరగగానే వార్తా వచ్చేసేది. అలా ఈ అంశం పై, ఒక నెల రోజులు దాకా, వీటికి సంబంధించి, ఎదో ఒక వార్తా వస్తూ, చివరకు పధకం ఫైనల్ అయిన తరువాత అధికారికంగా చెప్పే వారు. అయితే, ఇలా చేస్తుంటే, ఎంత పెద్ద పధకం అయినా, ప్రజల్లో ఇంట్రెస్ట్ పోతుంది, ఎప్పటి నుంచి వార్తల్లో నానుతూ ఉండటంతో, చివరకు ప్రజల్లో పెద్దగా ఈ పధకం పై ఇంట్రెస్ట్ ఉండదు. పధకం వల్ల లబ్ది చేకురినా, సర్ప్రైజ్ ఫాక్టర్ అనేది మిస్ అయ్యి, ప్రజల్లో ఎమోషన్ గా పధకం వెళ్ళేది కాదు.

penshions 19012019

అయితే మొన్న చంద్రబాబు పెన్షన్ లు పెంచుతూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో, ప్రజలందరూ షాక్ అయ్యారు. ఎవరూ పెన్షన్లు పెంచుతారని అనుకోలేదు. ఇదో సర్ప్రైజ్ లాగా చంద్రబాబు నోటి వెంట రావటంతో, ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తూ తీసుకొన్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనపై టీడీపీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ‘సార్వత్రిక ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు అమలు చేసిన ఈ నిర్ణయం ఆటనే మార్చేసింది. మమ్మల్ని ముందు పీఠిలో నిలిపింది’ అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పేదల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తిపని వారికి ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు కొద్ది రోజుల కిందట నిర్ణయం ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం నెలకు రూ.1000 వంతున ఇస్తున్న పింఛన్‌ను రూ.2000 చేశారు. వికలాంగులకు రూ.1500వంతున ఇస్తున్న మొత్తాన్ని రూ.3000 చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇటువంటి పింఛన్లు పొందుతున్న వారు 54లక్షల మంది ఉన్నారు. కొత్తగా మరో 3లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

penshions 19012019

పింఛన్లను ఐదేళ్లలో రెండు దఫాలు పెంచడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా పెంపు ప్రకటించినా వచ్చే ఏప్రిల్‌ నుంచి దానిని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి రూ.ఆరున్నర వేల కోట్లుగా ఉన్న పింఛన్ల ఖర్చు పెంచిన తరువాత ఏడాదికి రూ.13 వేల కోట్లకు చేరనుంది. సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో బలమైన ప్రభావం చూపిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘అధికారంలో ఉన్న పార్టీపై రకరకాల అసంతృప్తులు ఉండటం సహజం. ఈ నిర్ణయం అటువంటి అసంతృప్తులను పక్కకు తోసేసింది. పేదవర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచింది. ప్రతిపక్ష పార్టీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాల్లో కూడా కొంత భాగం టీడీపీ వైపు ఈ నిర్ణయంతో మళ్లుతున్నాయి. వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాన్ని ఈ నిర్ణయం కలిగిస్తోంది’ అని ఒక మంత్రి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read