ఆరవ రోజు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్నోత్తరాల తరువాత ఈ రోజు వివిధ బిల్లుల పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ..ఎస్టీ కమిషన్ ను, ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ గా, రెండు వేరు వేరుగా చేస్తూ, ప్రభుత్వం బిల్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేతలు, వరుస పెట్టి చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఎస్సీలకు, ఎస్టీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసారని, వరస పెట్టి విమర్శలు చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ హయంలో ఎస్సీలకు, ఎస్టీలకు చేసిన పని గురించి వివరించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు, బడ్జెట్ లో ఎస్సీలకు, ఎస్టీలకు పెట్టిన ఖర్చులో సగం కూడా చెయ్యలేదని, ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉందని గుర్తు చేసారు. తమ హయంలో ఎస్సీలకు, ఎస్టీలకు బడ్జెట్ లో ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టింది లెక్కలు చదవి వినిపించారు. తాము 95 శాతం వరకు నిధులు ఖర్చు పెట్టిన విషయాన్ని చెప్పారు.

cbn 16122019 2

అలాగే ఎస్సీలకు, ఎస్టీల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు మార్చే నిర్ణయాలు తాము తీసుకున్నామని, అన్నీ చదివి వినిపించారు. తాము ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి, 2018-19లోనే, 10 వేల కోట్ల ఖర్చు చేసామన్న విషయాన్ని గుర్తు చేసారు. కేఆర్ నారాయణన్ లాంటి వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వటంలో, అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ లో ఉండి కీలకంగా వ్యవహరించామని చెప్పారు. అలాగే, లోక్ సభలో స్పీకర్ గా బాలయోగిని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతిని అత్యున్నత స్థానంలో నియమించి, వారికి గుర్తింపునిచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీగా దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావుకు అవకాశం ఇచ్చామన్నారు.

cbn 16122019 3

తాము ఎస్సీ సంక్షేమానికి ఇన్ని పనులు చేస్తే, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా, నిన్న కాక మొన్న వచ్చిన వీళ్ళు, తమకు పాఠాలు చెప్తున్నారని అన్నారు. జగన్ కావాలని సభ్యులను రెచ్చగొడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం గొప్పగా తెచ్చిన, దిశ చట్టం తీసుకొచ్చిన రోజునే గుంటూరు లో ఒక విద్యార్ధిని పైన జరిగిన దాడి గురించి అడిగితే, ఏమి సమాధానం చెప్తారని, జగన్ ను ప్రశ్నించారు. ఈ సభలో తాను అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించారని, తాము దీని పై ప్రివిలేజ్ నోటీసు ఇస్తే, దానికి ఇప్పటి వరకు సామాధానం చెప్పకుండా పారిపోయిన ముఖ్యమంత్రి అంటూ, జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ, వక్రీకరించి, పబ్బం గడుపుకోవం వీళ్ళకు అలవాటు అయిపోయిందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read