సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావట్లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఓటమికి ఏదో ఒక కారణం ఉండేదన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో కారణాలేంటో కనబడని పరిస్థితి నెలకొందన్నారు. లోటు బడ్జెట్‌లోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. ఓటమికి కారణాలు పరిశీలించి.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదు సార్లు టీడీపీ గెలిచినా ఎప్పుడూ ప్రత్యర్థులపై దాడులు చేయలేదని చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లోనే 100కు పైగా దాడులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు ఎక్కడ జరిగినా తక్షణమే స్థానిక నాయకత్వం స్పందించాలని కోరారు. ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలన్నారు.

cbn 14062019

"ఎన్నికల ఫలితాలు వచ్చి 22రోజులు(మూడు వారాలు)అయ్యింది. సీట్లు తగ్గినా ఓట్ల శాతం గణనీయంగా ఉంది. ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నాం.ఎమ్మెల్యేలు,ఎంపిలతో మాట్లాడటం జరిగింది. ఈ రోజు అభ్యర్ధులతో సమావేశం ఏర్పాటు చేశాం. 37ఏళ్ల చరిత్ర ఉన్నపార్టీ తెలుగుదేశం, ఈ 37ఏళ్లలో 5సార్లు గెలిచాం,4సార్లు ఓడిపోయాం. గెలిచినప్పుడు ఆనందం,ఓడినప్పుడు ఆవేదన సహజం. అయినా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఓటమికి ఏదో ఒక కారణం ఉంది.ఈసారి ఎన్నికల్లో కారణాలు కనబడని పరిస్థితి. ప్రతి 5ఏళ్లకు ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ శాశ్వతం.. భావితరాలకు పార్టీని అందించాల్సిన బాధ్యత. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం కరెక్ట్ కాదు. "

cbn 14062019

"విభజన తరువాత రాష్ట్రంలో దిక్కుతోచని స్థితి. వేల కోట్ల ఆర్ధికలోటులో అభివృద్ధిలో ముందుకు పోయాం.. విభజన సమస్యలను ఒక్కొక్కటే అధిగమించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్దిలో ముందుకు పోయాం. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. అయినా ఓటమికి దారితీసిన అంశాలను పరిశీలించాలి. అంతర్గత అంశాలు, బైట ప్రభావితం చేసిన అంశాలు అధ్యయనం చేయాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లోపాలు ఏమన్నా ఉంటే చక్కదిద్దుకోవాలి. ఈ రోజు ఒక రాజకీయ పార్టీగా ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంది. మనకు ఓట్లేసిన ప్రజలు, మనల్నే నమ్మిన కార్యకర్తలకు అండగా ఉండాలి. కార్యకర్తల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read