తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కడప జిల్లా జమ్మలమడుగు నేతలు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. "మీ అందరికీ ఒక అనుమానం ఉంది. ఎవరో పాత వాళ్ళు ఇప్పుడు పోయి, గెలుస్తాం అనే వాసన రాగానే వచ్చేస్తారు. ఎన్నికల ముందు వచ్చేసి, అందరి కంటే ముందు నాకు కనపడతారు. మీ అందరికీ ఒకటే చెప్తున్న, గుర్తు పెట్టుకోండి. కష్టాల్లో ఉండే వాళ్ళే నాకు శాస్వతం. ఈ రోజు కష్ట కాలంలో ఎవరు అయితే పోరాడుతున్నారో, వారికి కూడా గుర్తింపు ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా తీసుకోను అని మీకు హామీ ఇస్తున్నా. ఇంతకు మునుపు చాలా సార్లు ప్రయత్నం చేసినా, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ సారి రికార్డు కూడా పక్కగా ఎస్టాబ్లిష్ చేస్తున్నా. మీరు అడగక పోయినా, ఎవరు అయితే కష్టపడి పని చేసారో, వారిని నేరుగా గుర్తించి వారికి అండగా ఉంటా. అలాంటి మెకానిజం మన దగ్గర ఇప్పుడు ఉంది. మీకు ఎవరికీ అనుమానాలు వద్దు. కష్టపడిన వారికే, భవిష్యత్తులో మన పార్టీలో మంచి జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా మీ అందరికీ ఈ విషయంలో హామీ ఇస్తున్నా. "అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

cbn 26112021 2

ఇక కడప విషయాలు మాట్లాడుతూ, "కడప జిల్లాలో అతి విశ్వాసంతో అందరూ ఓట్లేశారు. ఇసుక మాఫియా కోసం గ్రామాలను ముంచేశారు. ఒకే ఊళ్లో 13 మంది చనిపోయారు.. 40 మంది గల్లంతయ్యారు. ముఖ్యమంత్రి చేతగాని తనం కాక ఇంకేంటి..? - తిరుపతిలోనూ శాండ్ మాఫియా ఆగడాలు. పరామర్శలకు వెళ్లలేదు గానీ.. ఫంక్షన్లకు మాత్రం వెళ్తున్నారు. తాను వెళ్తే అధికారులంతా వచ్చేస్తారని, ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం సాకులు చెప్తున్నారు. ప్రకృతితో ఆడుకుంటే మనకు ఇబ్బందులు తప్పవు. కరకట్టలన్నీ లీకైపోయాయి.. ఆ నీరంతా పొలాల్లోకి వచ్చింది. ఒక్కరిని కూడా కాపాడలేదు.. ఏ ఒక్కరికీ భోజనం పెట్టలేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం చారిత్రక అవసరం. రాష్ట్రంలో వ్యవసాయం మొత్తం సర్వనాశనమైంది. రాష్ట్రంలో రోడ్లు వేస్తే, ప్రాజెక్టులు కడితే పరిశ్రమలు వస్తాయి. రూ.2 లక్షల కోట్లు ఆదాయం వచ్చేలా 55 వేల ఎకరాలు అమరావతికి వచ్చాయి. అభివృద్ధిని చూసిన తర్వాత కూడా రూ. లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ప్రజలు ఏమనుకుంటారో అని లేకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తున్నారు.కలెక్టరేట్ ను తాకట్టు పెట్టే పెద్దమనిషిని ఎక్కడా చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి అనుభవం లేదు.. అహంభావం ఉంది." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read