తిరుపతి పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి సభా వేదిక వద్దకు బయల్దేరగా, స్వాగతం చెప్పేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి సమీపంలోని ఐతవోలు వద్ద పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘మేము యుద్ధానికి పోవడంలేదు, ప్రభుత్వంపై దాడికి రాలేదు. నాపై అభిమానంతో స్వాగతం చెప్పేందుకు వచ్చిన యువకుడి తల పగులకొడతారా..? ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా యువతరం వస్తే అక్కసుతో రభస చేస్తారా..? చినబయలుపల్లి యువకుడు పాకాల హేమంత్ ను తీవ్రంగా గాయపరుస్తారా..? నా పాలనలో పోలీసులకు, వైసిపి పాలనలో పోలీసులకు ఎంత తేడా ..? చాలామంది సీఎంలను, డిజిపిలను చూశాం. హద్దుమీరి ప్రవర్తిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. నా పోరాటం పోలీసులపై కాదు, వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపైనే మా పోరాటం అంతా.." అంటూ చంద్రబాబు మండి పడ్డారు. అంతకు ముందు రోడ్డు పైనే, కొట్టిన పోలీసుల పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది మంచి పద్దతి కాదని పోలీసులను హెచ్చరించారు.

cbn 06112019 2

ఇక చంద్రబాబు చిత్తూరు జిల్లా టిడిపి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ వైఖరి పై మండి పడ్డారు. "జగన్మోహన్ రెడ్డి మొదట్లో ‘‘సుబ్రమణ్యం అన్నా నువ్వే సీఎస్, గౌతమ్ అన్నా నువ్వే డిజిపి, మీరే నడిపించాలి నన్ను’’ అన్నారు..5నెలల్లోనే సుబ్రమణ్యం అన్నను గంగలో కలిపేశారు. రేపు కూడా మీ పరిస్థితి అదే..ఆయన మనస్తత్వమే అంత.. మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ రాష్ట్రం కోసం ఢిల్లీలో రాజీలేని పోరాటం చేశారు. నాకు బాల్య స్నేహితుడు, కలిసి చదువుకున్నాం, నా పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాలకే గౌరవాన్ని పెంచారు. ఇన్నాళ్లు మనకు స్పూర్తి ఇచ్చారు, ఇప్పుడాయన స్ఫూర్తితో మనం పార్టీ కోసం పనిచేయాలి. టిడిపి కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. భౌతికదాడులు, ఆర్ధికదాడులు చేస్తున్నారు.బాధితులపైన నాన్ బెయిలబుల్ కేసులు, నిందితులపై బెయిలబుల్ కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. ఛలో ఆత్మకూరుకు వెళ్తుంటే నా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు. ఈ తాళ్లే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించాను. " అని చంద్రబాబు అన్నారు.

cbn 06112019 3

"నేను అడిగాననే అక్కసుతోనే ప్రజావేదికను కూల్చేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ప్రతిచోటా పులివెందుల పంచాయితీలు చేస్తున్నారు.ఇలాగే చేస్తే పులివెందుల పంపడం మిమ్మల్ని ఖాయం.
తొలి 6నెలల్లనే మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి 5నెలల్లోనే ఇంతకంటే చెత్త సీఎం ఉండడనే పేరు తెచ్చుకున్నారు. గతంలో చేసిన సీఎంలకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చాయా..? ప్రజలకు సేవలు చేసే సీఎంలనే ఇప్పటిదాకా చూశాం. ప్రజలను బాధలు పెట్టే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ప్రత్యర్ధి పార్టీలను అంతం చేయాలనే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ‘‘తవ్వండి తవ్వండి’’ అని అధికారులను ఉసిగొల్పారు, సన్మానాలు చేస్తాం అన్నారు. ఏం తవ్వారు ఈ 5నెలలు..? కొండను తవ్వి ఏం పట్టారు..? వెంట్రుక కూడా పట్టుకోలేక పోయారు. నీతి నిజాయితీతో సేవాభావంతో పనిచేశాం. తండ్రి అధికారం అండతో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు తానే సిఎం అయ్యాక మరింత రెచ్చిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా..? ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మారితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పుడే చూశాం. 11మంది సీఎంల పాలనలో ఇన్ని ఇబ్బందులు ఎవరూ పడలేదు. జగన్ సీఎం అయ్యాకే అన్నివర్గాల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read