తెలుగుదేశంలో న‌వ్యోత్తేజం పొంగి పొర‌లుతోంది. చంద్ర‌బాబు రాక‌తో ఉత్త‌రాంధ్ర ఉద్వేగంగా మారింది. ఒకే ఒక్క ప‌ర్య‌ట‌న‌తో ఫామ్‌లోకొచ్చిన వీరేంద్ర సెహ్వాగ్‌లా వైసీపీపై విరుచుప‌డ్డారు చంద్ర‌బాబు. విశాఖ‌లోనే కాదు ఉత్త‌రాంధ్ర‌లో చంద్ర‌బాబుని అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని శ‌ప‌థాల శ‌బ్దాలు చేసిన వారు, మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తో తెలుగుదేశాన్ని ఇరుకున‌పెట్టామ‌ని చంక‌లు గుద్దుకున్న‌వారు. అంద‌రికీ ఒకే ఒక టూరులో దిమ్మ‌తిరిగే ఝ‌ల‌క్ చంద్ర‌బాబు ఇచ్చారు. విశాఖ విమానాశ్ర‌యంలో దిగుతూ ఘ‌న‌స్వాగ‌తం అందుకున్న బాబు. శ్రీకాకుళం చేరేవ‌ర‌కూ జ‌నం..జ‌నం...ప్ర‌భంజ‌నంగా ముందుకు సాగారు.. విశాఖ‌లో దిగుతూనే టిడిపి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించి నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.. చంద్ర‌బాబు చాణ‌క్యం ఇక్క‌డి నుంచే ఆరంభ‌మైంది.. భీమిలి వెళ్తూ...అవినీతి అన‌కొండ జ‌గ‌న్‌రెడ్డి సాయిరెడ్డి మింగేసిన రుషికొండ వైపు కాన్వాయ్‌ని తిప్పారు. విశాఖ‌లో కొండ‌ల్ని పిండి చేసి ఎలా జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగులు క‌నుమ‌రుగు చేస్తున్నాయో చ‌ర్చ‌కి పెట్టారు. రుషికొండ‌కి వెళ్ల‌కుండా చంద్ర‌బాబుని అడ్డుకుని...అక్క‌డే తాము అక్ర‌మాలు చేస్తున్నామ‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగ్‌ అంగీక‌రించేలా చేయ‌డంలో చంద్ర‌బాబు మార్క్ రాజ‌కీయం ఉంది. ప‌ర‌దాలు చాటున‌, వ‌ల‌ల ర‌క్ష‌ణ‌లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌రెడ్డికి ... ప్ర‌జ‌లే ర‌క్ష‌ణ‌గా చేసే ప‌ర్య‌ట‌న‌లు ఎలా వుంటాయో క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించారు సీబీఎన్‌.

cbn 06052022 2

టీ టైమ్‌ని కూడా ప్ర‌జ‌ల‌తోనే మ‌మేకం అయ్యేలా సరి కొత్త రాజకీయ ప్రోగ్రాం కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇక భీమిలి స‌భ‌లో త‌న అమ్ముల‌పొదిలో ఒక్కో అస్త్రం తీసి సూటిగా సంధించారు. తాను ఏం చెప్ప‌కుండానే ఉత్త‌రాంధ్ర‌కి జ‌గ‌న్ రెడ్డి చేసిన ద్రోహం...తాను చేయ‌బోయే న్యాయం ఏంటో ప్ర‌జ‌ల‌తోనే చెప్పించారు. నేను తెచ్చేవి ఐటీ ఉద్యోగాలు- జ‌గ‌న్ ఇచ్చేవి వ‌లంటీర్ ఉద్యోగాల‌ని ఏం కావాలో తేల్చుకోమ‌న్నారు బాబు. విశాఖ టిడిపి కార్యాల‌యం ఎదుట బీసీ మహిళాసంఘం పేరుతో విజ‌య‌సాయిరెడ్డి ఫ్యాన్స్ ఓ న‌లుగురు మ‌హిళ‌లు ఆందోళ‌న చేసి హ‌డావిడి చేశారు. వీళ్ల‌కి కౌంట‌ర్‌ని వేలాది మంది ప్ర‌జ‌ల‌తో చంద్ర‌బాబు ఇప్పించారు. రాజ‌ధాని కావాలా? అభివృద్ధి కావాలా? అని వేలాది మంది ప్ర‌జ‌ల్ని అడిగారు చంద్ర‌బాబు. ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో అభివృద్ధే కావాల‌ని నిన‌దించారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా వుంటుంది..విశాఖ ప్ర‌పంచ‌స్థాయిలో అభివృద్ధి చెందుతుంద‌ని ఎటువంటి శ‌ష‌భిష‌లు లేకుండా స్ప‌ష్టం చేశారు దార్శ‌నికుడు నాయుడు. ఒకే ఒక్క టూర్‌లో తెలుగుదేశంకి ప్ర‌జాద‌ర‌ణ ఏ స్థాయిలో వుందో, వైసీపీపై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత‌గా పెరిగిందో చూపించ‌గ‌లిగారు. అభివృద్ధి పేరుతో విశాఖ‌ని దోచుకుంటోన్న జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగుల అవినీతిని బ‌య‌ట‌పెట్టారు. మాకు అవినీతి వ‌ద్దు..అభివృద్ధి ముద్దు అని ప్ర‌జ‌ల‌తోనే చెప్పించ‌గ‌లిగారు. ఉత్త‌రాంధ్ర గ‌డ్డ తెలుగుదేశం అడ్డా అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇదీ చంద్ర‌బాబు చాణ‌క్యం అంటే...ఇదీ విజ‌న‌రీ లీడ‌ర్ స్కెచ్ అంటే..

Advertisements

Advertisements

Latest Articles

Most Read