పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఒకే వేదికపై చేరి ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపాయేతర పార్టీల నేతలు ఐక్య ర్యాలీకి తరలివచ్చారు. ఒక్కొక్కరిగా ప్రసంగిస్తూ భాజపా ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. బెంగాలీలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం మరోసారి దేశం దృష్టికి తీసుకు వెళ్లారు. మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని ఎలా వెనక్కు తీసుకు వెళ్తున్నారో, చెప్పారు. భాజపా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు.

moditeam 19012019 2

విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు. విభజించు పాలించు అనే రీతిలో భాజపా దేశాన్ని పాలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

moditeam 19012019 3

కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపుతప్పుతున్నాయని అన్నారు. ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. అప్పట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టి, ఫస్ట్ మీటింగ్ విజయవాడలో పెట్టి, తరువాత మీటింగ్ కోల్‌కతాలో పెట్టారని, ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కోల్‌కతాలో పెట్టామని, తరువాత మీటింగ్ అమరావతిలో పెట్టి, మోడీ, అమిత్ షా లకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read