తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో ప్రభుత్వం అనూహ్య మార్పులు చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరిచింది. గతంలో రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో కూడా, చంద్రబాబు బధ్రత విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కాని ఈ సారి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఆయనకు. వాహనాలను కుదించారు. కాన్వాయ్ లో రెండు వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వ్యవహారాల కమిటీలో సమీక్ష నిర్వహించాకే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను తగ్గిస్తూ ప్రభుత్వ భద్రతా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ ముఖ్యనేతలందరూ దీనికి అభ్యంతరం తెలుపుతున్నారు.

cbnconvey 12062019

జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తికి ఏ విధంగా పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో తిరగాల్సిన ఉంటుంది.. అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ నేతలు. అలాగే ప్రజా సమస్యలపై అనేక చోట్లకు తిరగాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ముందు ముందు చంద్రబాబు రాష్ట్రమంతా తిరగాలనుకుంటున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కనుక పైలెట్ క్లియరెన్స్ వాహనం, ఎస్కార్ట్ వెహికిల్ అవసరం అని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వారు. జడ్‌ప్లస్‌ భద్రతలో చంద్రబాబు ఉన్నందున ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌1, ఎస్కార్ట్‌2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ1, ఎన్‌ఎస్‌జీ2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్​లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన వాహనం మినహా మిగిలిన వాహనాలన్నింటినీ అసెంబ్లీ బయట పెట్టించారు.

cbnconvey 12062019

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత జగన్‌ కాన్వాయ్‌కు అసెంబ్లీలో ఏ-2 నుంచి లోనికి అనుమతి ఉండేది. ప్రతిపక్షనేత వాహనాలను మంత్రుల వాహనాలతో సమానంగా పార్క్‌చేసుకునే అవకాశం ఉండేది. అయితే చంద్రబాబుకు అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం తెదేపా వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీముఖ్యమంత్రిగా తగిన గౌరవం చంద్రబాబుకు ఉండేది. మునుపెన్నడూ ఇలా లేదనే భావన తెదేపా వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల అభ్యంతరాలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన సెక్యూరిటీని ఇస్తున్నాం అని.. దీనికితోడు జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఎలాంటి అవరోధం కల్పించటం లేదని స్పష్టం చేస్తోంది.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read