ప్రపంచ దేశాల్లో పేరు ఉన్న నేత, దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో తన మార్క్ గుర్తింపు ఉన్న నేత, ఒక తరానికి హీరో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి శిఖరం, నేడు ప్రజాస్వామ్య పధ్ధతిలో, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పై నిరసన తెలిపే హక్కు లేక, నేల మీద కూర్చుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని వేడుకుంటున్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుని, కరోనా నిబంధనల పేరుతో ప్రభుత్వం, చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వలేదు. నన్ను ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు నన్ను వెళ్ళనివ్వరు అంటూ చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లోనే నిరసనకు దిగారు. చంద్రబాబు వెంట కేవలం ఆయన వ్యక్తిగత సహాయకుడు, వ్యక్తిగత డాక్టర్ మాత్రమే ఉన్నారు. చంద్రబాబును కలవటానికి వచ్చిన ఏ ఒక్క నేతను కూడా ఆయన వద్దకు పంపించలేదు. అంతే కాదు చంద్రబాబు వద్ద, ఆయన వ్యక్తిగత సహాయకుల వద్ద ఉన్న ఫోన్లు కూడా లాక్కున్నారు. అయితే చంద్రబాబు గత ఆరు గంటలుగా నేల పైనే అలా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. అంతే కాదు, మధ్యానం ఇచ్చిన భోజనం కూడా వద్దు అని అన్నారు. దీంతో గత ఆరు గంటలుగా చంద్రబాబు దీక్ష కొనసాగుతూనే ఉంది.

తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు, దాదాపుగా అరగంటకు పైగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఒకటే ప్రధానంగా చంద్రబాబు చెప్తున్నారు. చిత్తూరులో నిరసన తెలపటానికి తనకు అనుమతి ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు ఆరు గంటలుగా నేల పైనే కూర్చుని ఉండటంతో, ఆయన కాళ్ళ నొప్పులతో రెండు కాళ్ళు మడుచుకుని, రెండు చేతులతో అడ్డు పెట్టుకుని, నొప్పులు భరిస్తూ అలాగే కూర్చున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, తనను కించపరుస్తూ ప్రవర్తించారని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. నన్ను అడ్డగించాలని నిర్ణయం తీసుకుంటే, మీరు ఎందుకు రాలేదు ? ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ ఆయన్ను కూడా ప్రశ్నించారు. కలెక్టర్ కూడా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు దీక్ష గురించి తెలుసుకున్న ఎస్పీ, బిస్కెట్ లు ఇచ్చి, ఇవి అయినా తీసుకోండి, దీక్ష విరమించండని కోరారు. మరో పక్క చంద్రబాబుని మధ్యానం 3.10 ఫ్లైట్ కి పంపించేయాలని అనుకున్నా, అప్పటికే ఫ్లైట్ ఫుల్ అవ్వటంతో, వీలు పడలేదు. రాత్రి ఏడు గంటల వరకు ఫ్లైట్ లేకపోవటంతో, అప్పటి వరకు చంద్రబాబుని పోలీసులు ఎక్కడ ఉంచుతారో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read