జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టిడిపి పార్లమెంటరీ పార్టీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన భేటికి టిడిపి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 9అంశాలపై ఈ భేటిలో చర్చించారు. రాజధాని అమరావతి మార్పు, 3 రాజధానుల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వ విధ్వంసకర చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు, దిగజారిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ఉపాధి హామీ నిధుల పెండింగ్, దారి మల్లింపు, పోలవరం పనులు ఆగిపోవడం, కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి చేస్తున్న ప్రలోభాలు- రాస్తున్న లేఖలు, మీడియా పై దాడులు- ఆంక్షలు- అక్రమ కేసులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్లేలు, ఇతర నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, జాతీయ అంశాలైన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జన పట్టిక తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, అవినీతి, అక్రమాలు, విధ్వంస కార్యక్రమాలు, కేంద్ర నిధుల సద్వినియోగంలో వైఫల్యం, ఉన్న నిధులను ఖర్చు చేయలేక పోవడం, అప్పులివ్వలేమని బ్యాంకులే లేఖలు రాయడం, ప్రభుత్వ విశ్వసనీయతకే తూట్లు పెట్టడం, పెట్టుబడులన్నీ వెనక్కి పోవడం తదితర అంశాలన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఈ భేటిలో చర్చించిన అంశాలు: 1) ‘‘ టిడిపి పాలనలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, వైసిపి ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఈ 8నెలల్లో అట్టడుగుకు దిగజారింది. ఈ వాస్తవాలను ఇటీవల కొన్ని సర్వేలే బైటపెట్టాయి. పెరిగిన అప్పులు, తగ్గిన ఎయిర్ ట్రాఫిక్, తగ్గిన వాహనాల కొనుగోళ్లు, తగ్గిన విద్యుత్ వినియోగం వైసిపి ప్రభుత్వ చేతగాని తనాన్ని స్పష్టంగా బైటపెట్టాయి. 2).భారత దేశ మ్యాప్ లో ఏపి రాజధాని అమరావతి లేకపోవడం కేంద్రం దృష్టికి తెచ్చి, పార్లమెంటులో పట్టుబట్టి సాధించారు, మళ్లీ అమరావతిని మ్యాప్ లో పెట్టించారు, అందుకు టిడిపి ఎంపిలను అభినందిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దానిపై కేంద్రానికి ధన్యావాదాలు కూడా తెలిపాం. అదే స్ఫూర్తి ఇప్పుడు టిడిపి ఎంపిలు మళ్లీ చూపాలి. రాజధాని అమరావతి పరిరక్షణకు జెఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాజ్యాంగ వ్యవస్థల ప్రతినిధులకు వినతులు ఇవ్వాలి. జెఏసి ఆధ్వర్యంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతు కూలీ సంఘాల ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న దుర్మార్గ పాలన గురించి ప్రధానికి, కేంద్రమంత్రులకు, రాజ్యాంగ వ్యవస్థల పెద్దలకు వినతులు ఇవ్వాలి. మానవ హక్కుల కమిషన్ ,ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ తదితర రాజ్యాంగసంస్థల ప్రతినిధులను కలిసి వివరించాలి.

3).కౌన్సిల్ రద్దు నిర్ణయం గురించి జాతీయ పార్టీల నాయకులకు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. గతంలో రద్దు అయిన కౌన్సిల్ పునరుద్దరణ కోసం 5రాష్ట్రాలు, కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మరో 5రాష్ట్రాలు అడుగుతుంటే ఉన్న కౌన్సిల్ ను రద్దు చేయడం వైసిపి తుగ్లక్ చర్య. 8నెలల్లో 38బిల్లులను ఆమోదించారు, 2బిల్లులకు సవరణలు ప్రతిపాదించారు, ఇప్పుడొచ్చిన 2బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపి ప్రజాభిప్రాయం సేకరించాలని సూచించారు. దానికే అక్కసు పట్టలేక కౌన్సిల్ రద్దు చేయాలని తీర్మానం ఆమోదించి పంపడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, పట్టభద్రులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ వైసిపి ప్రభుత్వ తుగ్లక్ చర్యలను నిరసిస్తున్న విషయాన్ని ప్రస్తావించాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి దీనిపై గతంలో చేసిన సూచనలను గుర్తు చేయాలి. 4).నరేగా నిధుల సద్వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని ఈ 8నెలల్లోనే అట్టడుగుకు దిగజార్చారు. గత ఏడాది ఈ పాటికి రూ 6వేల కోట్ల నిధులు వ్యయం చేయగా ఈ ఏడాది అందులో సగం వ్యయం చేయలేక పోయారు. ఉపాధి పనులన్నీ నిలిపేశారు, గతంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిపేశారు. కొత్త పనులకు నిధులిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు

5).కండిషనబుల్ బెయిల్ పై ఉన్న ముద్దాయి తమ కేసుల విచారణలో ఏ దర్యాప్తు అధికారి కావాలో ఏవిధంగా లేఖలు రాస్తారు..? తన హోదా దుర్వినియోగం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా ఇది..? సాక్షులను ప్రభావితం చేయరాదు, విచారణాధికారులను ఇబ్బందుల పాలు చేయరాదు అని బెయిల్ షరతులలో లేదా..? షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న ముద్దాయి ఆ షరతులను ఉల్లంఘిస్తూ దర్యాప్తు అధికారులపై లేఖలు రాయడం ఏ సంకేతాన్ని పంపుతోంది..? వీటన్నింటి గురించి ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలి. 6)మీడియా ప్రతినిధులపై దాడులు, మీడియా ప్రసారాలపై ఆంక్షలు, జీవో 2430 తీసుకురావడం, తునిలో రిపోర్టర్ హత్య, చీరాలలో రిపోర్టర్ పై హత్యాయత్నం, నెల్లూరులో ఎడిటర్ ను, మైనారిటి రిపోర్టర్ ను వైసిపి ఎమ్మెల్యే చంపుతానని బెదిరించడం, మరో వైసిపి ఎమ్మెల్యేపై హత్య కేసు నమోదు కావడం, విద్యార్ధులను ఆరుబైట ఎండలో నిలబెట్టి, పాఠశాల తరగతి గదుల్లో పోలీసులు నివాసం ఉండటంపై కథనాలు ఇచ్చిన మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెట్టడం, అసెంబ్లీ ప్రసారాలకు 3ఛానళ్లను బ్యాన్ చేయడం, ఎంఎస్ వోలను రాష్ట్ర మంత్రులే బెదిరించి రాష్ట్రవ్యాప్తంగా 2ఛానళ్ల ప్రసారాలు బంద్ చేయించడం తదితర అంశాలన్నీ జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read