ఇటీవల కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ముంబైకి చేరుకున్న అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరులో ఉన్న లోపాలపై అఖిలపక్ష నేతలతో చంద్రబాబు చర్చించారు. మరి కాసేపట్లో వీబీ చవాన్ కూడలిలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం విజయవాడకు చంద్రబాబు చేరుకుంటారు.

kodandaram 23042019

వీవీ ప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు పై నిర్వచించిన అఖిల పక్ష సమావేశానికి తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం కూడా హయరయ్యారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు ఆయన ఆ భేటీలో పాల్గున్నారు. ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. చాలా దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని.. అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు.

kodandaram 23042019

వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఉదయం లోపాలు వస్తే మధ్యాహ్నానికి సరిచేసే పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో సీఈవో కూడా ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read