సహజంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాల మాట వినటం చాలా అరుదు. వారి డిమాండ్స్ కి తలొగ్గే పరిస్థితి ఏ ప్రభుత్వం అంత సామాన్యంగా చెయ్యదు. ఇక జగన్, చంద్రబాబు లాంటి వైరం ఉన్న నేతల సంగతి అయితే చెప్పే పనే ఉండదు. అదే రాజకీయ కక్షల విషయంలో కూడా తగ్గాల్సిన పరిస్థితి అసలే ఉండదు. అలాంటిది ఇప్పుడు జగన్ ప్రభుత్వం, చంద్రబాబు చేసిన పోరాటానికి తగ్గింది. మూడు నెలల్లోనే ఇది ప్రతిపక్షం, ప్రభుత్వం పై సాధించిన విజయం. జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను వెంటాడి వెంటాడి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో 8 మంది చనిపోయారు కూడా. 500 పైగా దాడులు జరిగాయి. అంతే కాదు తోటలు నరకటం, పొలాలు లాక్కోవటం, ఇంటికి వెళ్ళకుండా గోడలు కట్టటం, ఇలాంటి వికృత పనులు కూడా చేస్తున్నారు.

cbn 13092019 2

వీటి పై రెండు నెలల క్రిందటే చంద్రబాబు మొదటిసారిగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉద్రిక్తతలు సహజం అని, నెల రోజులు అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదని, చంద్రబాబు పల్నాడు పర్యటన చేసారు. అక్కడ ఒక మహిళను చంపేస్తే, ఆమె కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వాన్ని, పోలీసులను ఈ దాడులు అదుపు చెయ్యాలని కోరారు. తరువాత కొన్ని రోజులుగా, దాడులు తగ్గక పోవటంతో, తెలుగుదేశం పార్టీ తరుపున, స్వయంగా డీజీపీని కలిసి, సమస్యను వివరించి, ఈ దాడులు జరగకుండా చూడాలని, ప్రజలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారని అన్నారు. అయినా దాడులు ఆగలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. దాడులు వల్ల, ఊరు వదిలి వెళ్ళిపోయాన వారికి ఆశ్రయం కల్పిస్తూ, స్వయంగా పార్టీ తరుపున శిబిరం నడిపారు.

cbn 13092019 3

దాదపుగా 10 రోజులు ఈ శిబిరం నడిపి, పోలీసులు వచ్చి స్వయంగా వీరిని ఊళ్ళకు తీసుకు వెళ్ళాలని అన్నారు. 10 రోజులు గడువు ఇచ్చి, లేకపోతె మేమే స్వయంగా తీసుకు వెళ్తాం అని అన్నారు. అయితే ప్రభుత్వం తరుపున హోం మంత్రి స్పందిస్తూ, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ చెప్పారు. దీంతో చంద్రబాబు చలో పల్నాడు పిలుపు ఇచ్చారు. ఈ విషయం బాగా పెద్దది అయ్యింది. అక్కడ బాధితులు చేత మాట్లాడించిన మాటలు, మీడియాలో ప్రముఖంగా వచ్చాయి, దీంతో ఇక ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. పైడ్ ఆర్టిస్ట్ లు అన్న వారినే, దగ్గరుండి, వారిని సొంత ఊరిలో పోలీసులు దింపారు. అక్కడ ఉన్న వైరి వర్గానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఏదైతే కోరారో అది నెరవేరింది. ప్రభుత్వం చేతే వారిని సొంత ఊళ్ళకు పంపించటంలో చంద్రబాబు పోరాటం సక్సెస్ అయ్యింది. చంద్రబాబు బుధవారం ఆ ఊరు వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఈ విధంగా, మూడు నెలలకు పైగా మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వాన్ని, తమ పోరాటంతో దిగి వచ్చేలా చేసి, వారి చేతే వారి తప్పు ఒప్పించేలా చెయ్యటంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పై పోరాడి మొదటి విజయం సాధించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read