పాకిస్తాన్‌ నేవీ అదుపులో ఉన్న 24 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కళా వెంకట్రావు విజ్ఞప్తితో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. జాలర్లను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పట్టుబడిన జాలర్లది శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో జిల్లాలుగా తెలుస్తోంది. గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 24 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది.

fishermen 12122018

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ అధికారులతో భారత ఎంబసీ అధికారి గౌరవ్ అహ్లువాలియా సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు ఇస్తామని భారత ఎంబసీ అధికారుల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల యోగక్షేమాలపై ఆరా తీశారు. మత్స్యకారులంతా సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచించారు.

fishermen 12122018

అదుపులో ఉన్న జాలరల్లో 20 మంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల వాసులుగా గుర్తించారు. నమిగతా వారు తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాకు చెందిన జాలర్లను తెలుస్తోంది. మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్బంధించిన జాలర్లను కరాచీ పంపినట్టు సమాచారం. ఏపీ భవన్ అధికారులతో ఈ మేరకు చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. అదుపులో ఉన్న జాలర్లను తిరిగి ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని, జాలర్లకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్టే, ఆ కుటుంబాలకి, ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read