కోవిడ్ మ‌న రాష్ట్రంలో తొలి కేసు న‌మోదు కాక‌ముందే అప్ర‌మ‌త్త‌త‌పై అలెర్ట్ చేసిన ముందుచూపున్న నాయ‌కుడు చంద్రబాబు. దేశం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌క‌ముందే ప్ర‌జ‌లంద‌రికీ జాగ్ర‌త్త‌గా వుండాల‌ని బ‌హిరంగంగా అప్పీల్ చేసి...తెలుగుదేశం కార్యాల‌యాలు లాక్‌డౌన్ చేసి ఐసోలేట్ అయ్యారు. అప్ప‌టి నుంచీ కోవిడ్ గైడ్‌లైన్స్ , తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌తోపాటు ఆన్‌లైన్ ద్వారా వేలాది మంది క‌రోనా సోకిన‌వారికి ఉచితంగా వైద్యం చేయించారు చంద్ర‌బాబు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..మొద‌టి ద‌శ‌, రెండో ద‌శ దాటిన త‌రువాత మూడో ద‌శ‌లో చంద్ర‌బాబుని కోవిడ్ తాకింది. ఇటీవ‌ల మాచ‌ర్ల‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్త చంద్ర‌య్యని వైసీపీ మూక‌లు హ‌-త్య‌ చేయ‌డంతో ..కేడ‌ర్లో ధైర్యం నింపేందుకు అంత్య‌క్రియ‌ల్లో వేలాది మందితో పాల్గొన్నారు. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డి ప‌రీక్షించుకుంటే కోవిడ్ అని తేలింది. వెంట‌నే స్వీయ‌నిర్బంధంలోకి వెళ్లి ఆన్లైన్‌లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వైద్యం పొందుతున్నారు. ఈ స‌మ‌యంలో కూడా వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. చంద్రబాబు ఏడు పదుల యువకుడు. ఆయన శరీరతత్వం, యువకులకు అంటే భిన్నం అనే సంగతి తెలిసిందే. ఎంత పని అయినా సరే చంద్రబాబు చేసుకుంటూ వెళ్తారు.

cbn 21012022 2

యువతతో పోటీ పడి పని చేస్తూ ఉంటారు. అలాంటి చంద్రబాబు కరోనా రాగానే ఆయన అన్ని పనిలో ఆపేసి, ఇంట్లో పడుకుని ఉంటారని, రెస్ట్ తీసుకుంటూ ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు మనం అనుకునే దానికి భిన్నం. చంద్ర‌బాబు కోవిడ్ నుంచి కోలుకోవాల‌ని రాష్ట్ర‌మంతా పూజ‌లు, హోమాలు చేస్తుంటే...క‌రోనాతో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించాల‌ని..ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌, పార్టీ విభాగాలు, వైద్య‌బృందాల‌కు ఆదేశాలిచ్చారు. టెలీమెడిసిన్‌, టెలీ క‌న్స‌ల్టేష‌న్‌, ఐసోలేష‌న్లో వున్న‌వారికి ఆహారం-మందులు అందించే ప్ర‌క్రియ‌ని సుర‌క్షితంగా, స‌త్వ‌రంగా చేప‌ట్టాల‌ని దిశానిర్దేశం ఇచ్చారు. అలాగెఅ చంద్రబాబు పార్టీ ఇంచార్జ్ లతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. వర్చ్యువల్ రివ్యూలు చేస్తున్నారు. ఒకే రోజు రాష్ట్రంలోని 8 నియోజ‌క‌వ‌ర్గాల టిడిపి ఇంచార్జ్ ల‌తో చంద్రాబాబు రివ్యూ నిర్వహించారు. చంద్రబాబు అందరి లాంటి వారు కాదు. ఆయనకు పనే ప్రాణం. అందుకే ఏ పరిస్థితి అయినా పని చేస్తూనే ఉంటారు. నాయ‌కుడంటే చంద్ర‌బాబునాయుడు అని ఎందుకంటారంటే ఇందుకే..

Advertisements

Advertisements

Latest Articles

Most Read