రెండు రోజుల విరామం అనంతరం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో, పెట్టుబడుల విషయం పై, అధికార ప్రతిపక్షానికి గొడవ జరిగింది. చంద్రబాబు పెట్టుబడులు అంటూ, విదేశాలు తిరిగి వచ్చారని, అనవసర ఖర్చులు అయ్యాయని, ఆయన విదేశీ పర్యటనల వల్ల ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాష్ట్రానికి రాలేదని బుగ్గన ఆరోపించారు. చివరకు చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న కియా పరిశ్రమ కూడా రాజశేఖర్ రెడ్డి 2007లో సియంగా ఉండగా, కియా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ లో పెట్టమని కోరాగా, వైఎస్ఆర్ కోరిక మేరకే చంద్రబాబు సియంగా ఉండగా కియా పరిశ్రమ పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే దీని పై చంద్రబాబు స్పందించారు. విభజన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పని చేసానని చెప్పారు. పెట్టుబడులు కోసమే విదేశీ పర్యటనలు చేసామని, దాని ఫలితాలు కూడా చూసామని, ఇంకా కొన్ని ఫాలో అప్ అయితే, అవి కూడా వచ్చే అవకాసం ఉందని, ఇప్పటి ప్రభుత్వాన్ని అదే కోరుతున్నా అని చెప్పారు.

విదేశీ పర్యటనల పై గోల చేస్తున్న వారు, మోడీ చేస్తున్న విదేశీ పర్యటనల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో పెట్టమని, మీరు వీలైతే ఆ స్థానాన్ని నిలబెట్టండి అని వైసిపీని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత, 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, మీరు అంతకంటే ఎక్కువ కంపెనీలు, ఉద్యోగాలు తీసుకురండి అని అన్నారు. అంతే కాని అనవసర విమర్శలు చెయ్యవద్దని కోరారు. నా పై విమర్శలు చేసే ముందు, మీ వెనుక ఉన్నవి చూసుకోండి అంటూ చురకలు అంటించారు. తన పై విమర్శలు కట్టి పెట్టి, ఈ రాష్ట్రం కోసం మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి అని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read