అమరావతి అంటే మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరి ప్రతిపక్ష నాయకుల్లో, ఒకడికి ఏడుపు, ఒకడికి కుళ్ళు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులని కూడా అవహేళన చేస్తూ, ఆంధ్రల కలల రాజధాని అమరావతిని, భ్రమరావతి అంటూ ఎగతాళి చేసారు. ప్రతి సందర్భంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో ఎవరూ తక్కువ కాదు, జగన్, పవన్, ఇద్దరూ ఇద్దరే. ఇది ఇలా ఉంటే నిన్న రాజధానిలో నిర్మితమవుతున్న ఎమ్మెల్యే, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారుల అపార్టుమెంట్లు, ఎన్‌జీవో ఇళ్ల నిర్మాణాలు, తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. గవర్నమెంటు కాంప్లెక్స్‌లో ఐదు ఐకానిక్‌ టవర్ల అండర్‌ గ్రౌండు పనులను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిర్మాణాలను పరిశీలించారు.

amaravati 15112018 2

ఈ సందర్భంగా చంద్రబాబు వీళ్ళ ఇద్దరినీ ఉద్దేశిస్తూ, కొంత మంది మన రాజధానిని అవహేళన చేస్తూ, ఇటుకు లేదని, భ్రమరావతని అంటున్నారు, మీరు ఒకసారి అమరావతి వచ్చి ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు చూసి కుళ్ళిపోతారు. ఇది అమరావతో, భ్రమరావాతో అర్ధమవుతుంది. మరో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తయితే, మీకు ఇవి చూడటానికి రెండు కళ్ళు చాలవు. అప్పుడైనా, ఇది రియాలిటీ అని నమ్ముతారో లేదో అంటూ చంద్రబాబు చురకలు అంటించారు. అమరావతి రాజధాని ప్రజారాజధానిగా ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అన్నీ వర్గాల ప్రజలు ఇక్కడే ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లుచెప్పారు. ఇళ్లులేని నిరుపేదలకు రాజధానిలో గ్రూపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసినట్టు చెప్పారు. త్వరలో వాటిని పేదలకు అందజేస్తామన్నారు.

amaravati 15112018 3

పనులన్నీ సంతృప్తికరంగా సాగుతున్నాయని, ఇన్నాళ్లుగా తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా, ప్రతిపక్ష పార్టీలపైనా ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని విపక్షాలు దివాలాకోరు పార్టీలుగా మారాయని, రాజధాని నిర్మించడం, రాష్ట్రం అభివృద్ధి చెందడం వాటికి ఇష్టంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధానిలో వైభవాన్ని చూసి అవి ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు, ప్రయాణం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులివ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read