తమ పై వచ్చే తప్పుడు ప్రచారం తిప్పి కొట్టటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నిర్లిప్తతగానే ఉంటుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి అంతే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఒక కారణమే ఈ ఫేక్ ప్రచారం అని చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పారు. ఫేక్ ప్రచారం తిప్పి కొట్టక పోవటంతో, అదే నిజం అని ప్రజలు నమ్మి, ఇప్పుడు నిజం తెలుసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇదేదో ఇప్పుడు బీహార్ నుంచి వచ్చిన సలహాదారుడు చేసింది కాదు, గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే చేసారు. రెండు ఎకరాలు రెండు వేల కోట్లు, సింగపూర్ లో హోటల్, వ్యవసాయం దండగ అంటూ, ఇలా అనేక తప్పుడు ప్రచారాలు చంద్రబాబు మీద చేసినా, ఆయన తిప్పి కొట్టలేక పోయారు. కాలక్రేమణ అదే నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే మొత్తం అయిపోయిన తరువాత, దీనికి ఎంత కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు కదా. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు వ్యసాయం దండగ అని అన్నారు అంటూ రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేసారు. మనసులో మాట అనే పుస్తకంలో ఈ విషయం చెప్పారని అన్నారు. అయితే ఆ పుస్తకంలో రైతులను ఎలా ఆదుకోవాలి, ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలని చంద్రబాబు రాసుకున్నారు.

ln 021122020 2

ఐటి గురించి రాస్తూ, వ్యవసాయం నష్టాలు పాలు అవుతున్న ఈ రోజుల్లో, యువత ప్రత్యామ్న్యాయాలు వైపు చూస్తున్నారు అని రాసుకున్నారు. ఇది పట్టుకుని రచ్చ రచ్చ చేసారు. నిజానికి అది నిజమే కదా, అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ, వ్యవసాయం చేయటం లేదు కదా. అయితే చంద్రబాబు తాను ఆ మాటలు ఎక్కడ అన్నాను అని రాజశేఖర్ రెడ్డిని చాలెంజ్ చేస్తే, ఆయన చనిపోయే వరకు అది నిరూపించలేకపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ నిన్న శాసనమండలిలో, చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు అంటూ విమర్శలు చేసింది. దీంతో లోకేష్ లెగిసి, ఆ మాటలు ఎక్కడ అన్నారు, ఎప్పుడు అన్నారు చెప్పండి అని చాలెంజ్ విసిరారు. మనసులో మాట పుస్తకంలో అని, అది దొరకటం లేదని వైసీపీ మంత్రులు అనటంతో, ఆ పుస్తకం తీసుకు వచ్చి తెలుగుదేశం ఇందులో ఎక్కడ ఉందో చెప్పమని ఛాలెంజ్ చేసింది. ఆ మాటలు అన్నట్టు నిరూపించాలని చాలెంజ్ చేయటంతో, వైసీపీ ఇప్పటి వరకు ఏమి చెప్పలేక పోయింది. నాడు తండ్రి, నేడు కొడుకు విసిరిన చాలెంజ్ నిరూపించ లేక పోయారని, తెలుగుదేశం విమర్శిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read