ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు సమావేశమయ్యారు. నిన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో జరిగిన భేటీ అంశాలను చంద్రబాబు రాహుల్‌గాంధీకి వివరించినట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో తుదిదశ పోలింగ్‌ ముగియనుండటంతో తదుపరి కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల ముందు ఎలా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎన్డీయేతర కూటమి నేతలంతా ఒకసారి సమావేశమైతే బాగుంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

pawar 19052019

దాదాపు 20 నిమిషాల పాటు రాహుల్‌తో చంద్రబాబు సమావేశం కొనసాగింది. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో చంద్రబాబు అరగంటపాటు చర్చించారు. నిన్న మాయావతితో భేటీ సందర్భంగా అభ్యంతరం తెలిపిన పలు అంశాలపై ఆమెతో ఈరోజు మరోసారి చర్చించేందుకు దిల్లీలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇవాళ వీలైతే మాయావతితో రాహుల్‌, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో భవిష్యత్తు ఫలితాలపై ఒక స్పష్టమైన సరళి వెలువడే అవకాశం ఉన్నందున దాని ఆధారంగా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు 2004లో మాదిరి 145 సీట్ల దాకా వస్తే దాని నేతృత్వంలో కూటమి ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మిగతా ఏ ప్రాంతీయపార్టీకీ అన్ని సీట్లు వచ్చే అవకాశం లేనందున తప్పనిసరిగా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుందని, దానివల్ల మిత్రపక్షాలు త్వరగా కాంగ్రెస్‌తో కలిసి నడవానికి మానసికంగా సిద్ధమవుతాయని పేర్కొంటున్నారు.

pawar 19052019

అలాకాకుండా కాంగ్రెస్‌ 100 సీట్ల దగ్గర ఆగిపోయి, యూపీలో ఎస్పీ, బీఎస్పీలకు 50కిపైగా సీట్లు వస్తే కర్ణాటక తరహా పరిస్థితులు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్‌ పెద్దపార్టీగా ఉన్నప్పటికీ భాజపాను దూరంగా పెట్టడానికి విధిలేని పరిస్థితుల్లో ప్రాంతీయపార్టీలకు మద్దతిచ్చి అండగా నిలబడాల్సి వస్తుందని చెబుతున్నారు. అందువల్ల ఇందులో ఏ పరిస్థితి ఎదురైనా పక్కకు మళ్లకుండా అందరూ కలిసికట్టుగా నడిచేలా ప్రతిపక్షాలను మానసికంగా సిద్ధం చేసే పనిని చంద్రబాబు చేస్తున్నట్లు తెదేపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలితాల తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి ఎవరు ఏపాత్రనైనా పోషించవచ్చని, అయితే పాత్రలు మారాయన్న కారణంతో కూటమి నుంచి దూరం కాకుండా కలిసికట్టుగా ఉండటానికే సిద్ధమైతే బాగుంటుందన్న భావనను చంద్రబాబు ఇప్పుడు అఖిలేష్‌, మాయావతి ముందు వ్యక్తంచేసినట్లు సమాచారం. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. మాయావతి ఏది చెబితే తాను దాంతో ఏకీభవిస్తానని అఖిలేష్‌యాదవ్‌ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read