టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు ఈ నెల 22న అమరావతిలోని పార్టీ కార్యాలయంలో హాజరుకావాలని చంద్రబాబు అదేశాలు జారీ చేశారు. ఈ రోజు అభ్యర్ధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద్భంగా పోలింగ్ తీరుపై అనేక మంది సభ్యులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని కొందరు అభ్యర్ధులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న లోపు నివేదిక తయారు చేసి... అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు.

cbn 22 18042019

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పోరాటం వ్యక్తులపై కాదని..ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైననని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్ధుల నుంచి సమచారం తీసుకొని ఈ మేరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. కాగా ఈనెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పీలేరులో ఎన్నికల కమిషన్‌... ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్న టీడీపీ అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి సీఎంకు చెప్పారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నానన్నారు. ఫామ్‌-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

cbn 22 18042019

అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని భేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందని అన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్టు సమాచారం! ఇక, చంద్రబాబునాయుడు ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనూ బాబు ప్రచారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read